సమంత వద్దు సార్ నావల్ల కాదు అంటున్న కూడా.. బలవంతంగా అలాంటి పని చేయించిన స్టార్ డైరెక్టర్..!

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా వచ్చాక మనకి ఇష్టం లేని సీన్స్ .. మనకి ఇష్టం లేని సినిమాల్లో కూడా నటించాల్సి ఉంటుంది . అయితే అందరూ హీరోయిన్స్ అలా చేస్తారా..? అంటే నో అని చెప్పాలి . కొంతమంది ఇచ్చిన కమిట్మెంట్ కి కట్టుబడి అలాంటి పాత్రల్లో.. అలాంటి సీన్స్ చేస్తే మరి కొంతమంది మాత్రం కొన్ని కొన్ని భయాలు కారణంగా కొన్ని సీన్స్ చేయరు. మరి కొంత మంది సిచువేషన్ సహకరించక అలాంటి సీన్స్ చేయరు. అయితే అదే లిస్టులోకి వస్తుంది మన అందాల హీరోయిన్ సమంత .


"ఏం మాయ చేసావే" సినిమాతోనే అందరి మనసులను మాయ చేసి తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా హ్యూజ్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దున్నేసిందనే చెప్పాలి . ఇప్పటివరకు సమంతని బీట్ చేసే హీరోయిన్ ఇండస్ట్రీలో రానే రాలేదు అనడంలో సందేహం లేదు. పెళ్లయి విడాకులు తీసుకున్న సరే ఇప్పటికి ఇండస్ట్రీలో  నెంబర్ వన్ హీరోయిన్ గా చక్రం తిప్పేస్తుంది.  రష్మిక - శ్రీ లీల - పూజా హెగ్డే  లాంటి వాళ్ళు ఆమె అందాన్ని బీట్ చేయలేకపోతున్నారు . అంతేకాదు ఆమె స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోతున్నారు . అలాంటి సమంత చేత బలవంతంగా రాజమౌళి చేయించిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .


సమంత హీరోయిన్గా నాని హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "ఈగ". అప్పటివరకు మనుషులని పెట్టి సినిమా తీస్తున్న మూమెంట్లో ఏకంగా రాజమౌళి "ఈగ" ని హైలెట్ చేస్తూ సినిమాలు తెరకెక్కించడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది. అంతేకాదు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అయితే ఈ సినిమాలో సమంత చాలా చాలా సీన్స్ లో శాడ్ గా ఉండాలి . అంతేకాదు ఆమె క్యారెక్టర్ చాలా సైలెంట్ గా ఉండేది . నాని ఎంత సరదాగా ఉంటాడో ఇందు క్యారెక్టర్ అంతా సైలెంట్ గా  ఉండాలి అనే విధంగా రాసుకున్నాడు రాజమౌళి .


అయితే కొన్ని కొన్ని సీన్స్ లో సమంతకి ఏడుపు వచ్చినట్లు నటించడం అస్సలు రావడం లేదట.  సరదాగా సెట్లో అంతవరకు టైం గడిపి సడన్గా వచ్చి ఇప్పుడు శాడ్ సీన్ లో నటించాలి అనడంతో సమంత చాలా సార్లు ఇబ్బంది పడిందట . "నావల్ల కాదు సార్ ఇలా బాధపడుతూ నేను నటించలేను సార్" అంటూ చాలాసార్లు రాజమౌళికి నచ్చజెప్పిందట . అయినా సరే రాజమౌళి మొండివాడు . తను అనుకున్న ఎక్స్ప్రెషన్స్ వచ్చే వరకు సమంత చేత టేకుల మీద టేకులు తీసుకుంటూ ఆ సీన్స్ లో నటింపచేశాడు . సమంత ఇప్పటికీ ఆ సన్నివేశాలను మర్చిపోలేదట . ఈ సినిమా టీవీలో వస్తే  పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తారో మనందరికీ తెలుసు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: