బికినీ కోసం ఆ హీరోయిన్ చేసిన రచ్చకు కృష్ణ షాక్.. ఎంత చెప్పినా వినకుండా ?
అలా ఆమె చేసిన పనికి చివరికి హీరోయిన్ కి సంబంధించిన సన్నివేశాలు మొత్తాన్ని సినిమాల్లో మార్చేశారట. ఆ సినిమా ఏమిటంటే భరత్ సింహం.. కృష్ణ - నగ్మా కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాని సాగర్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నగ్మా రెండు బికినీ వేసుకునే సన్నివేశాలు చేయాల్సి ఉందట. అయితే ఆ సీన్స్ తెరకెక్కించే సమయంలో దర్శకుడు బికినీలను నగ్మాని కొనుక్కొని తెచ్చుకోమన్నారట. నిర్మాత డబ్బులు కూడా ఇస్తా అన్నారట అయితే షూటింగ్ అయిపోయాక నగ్మా రెండు బికినీల ధర 60 వేలు అని చెప్పిందట. దాంతో షాక్ అయిన నిర్మాత రెండు చిన్న బికినిలు 60వేల అవుతుందాని గొడవపడ్డారట. దానికి నగ్మా ఫైర్ అయ్యి గొడవ మరింత పెద్దది చేసిందట.
అయితే 60 వేలు తాను ఇస్తానని డైరెక్టర్ సాగర్ చెప్పినా కూడా మీ డబ్బులు నాకు వద్దు నాకు నిర్మాత ఇస్తేనే తీసుకుంటాను అని గోల చేసి మరి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయిందట నగ్మా.ఇక ఆ తర్వాత ఎంత మంది బ్రతిమిలాడి న కూడా వినలేదట. ఇక చివరికి కృష్ణనే స్వయంగా వెళ్లి చెప్పినా కూడా వినకపోవడంతో డైరెక్టర్ సాగర్ నగ్మా కి సంబంధించిన పాత్ర మొత్తం మార్చేసి ఆమె క్యారెక్టర్ ని వేరే విధంగా చూపించారట . అలా ఈ సినిమా షూటింగ్ సమయంలో పెద్ద రచ్చ చేసింది అంటూ సాగర్ ఓ ఇంటర్వ్యూలో నగ్మా కి సంబంధించిన ఈ విషయలను బయట పెట్టారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నగ్మాని తీసుకోమని వేరే వాళ్ళు చెప్పినా కూడా డైరెక్టర్ సాగర్ ఆమెతో సినిమా చేయలేదు.