రవితేజ.. కావ్య ఇద్దరినీ నిండా ముంచేసిన ఆ బ్యానర్.. ఒకే సంవత్సరంలో అలాంటి ఎదురుదెబ్బలు..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీలో హిట్లు , ఫ్లాప్ లు అనేవి చాలా సర్వసాధారణమైన విషయం. కొన్ని సందర్భాలలో కొంత మంది నటి నటులకు అదిరిపోయే రేంజ్ లో విజయాలు దక్కుతూ ఉంటాయి. అదే సందర్భంలో కొంత మంది కి వరుస ఫ్లాప్ లు దక్కుతూ ఉంటాయి. ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలు వస్తాయో వారికి క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. సినిమా అవకాశాలు కూడా భారీగా వస్తాయి. ఇక ఎవరికైతే వరుస ఫ్లాప్ లు వస్తాయో వారికి సినిమా అవకాశాలు తగ్గుతాయి. క్రేజ్ కూడా క్రమ క్రమంగా తగ్గుతూ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న యువ నటి మానులలో కావ్య దాపర్ ఒకరు. వీరిద్దరూ కూడా వరుస అపజయాలతో కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. ఇకపోతే ఒకే బ్యానర్ ద్వారా వీరిద్దరికీ ఈ సంవత్సరం రెండు అపజయాలు వచ్చాయి. పీపుల్స్ మీడియా బ్యానర్ వారు రవితేజ హీరోగా కావ్య దాపర్ హీరోయిన్గా ఈగల్ అనే మూవీ ని రూపొందించారు. ఈ సినిమాను ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల చేశారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఇదే సంస్థ వారు రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీని రూపొందించారు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం అని మూవీని రూపొందించారు. ఈ సినిమాలో కావ్య దాపర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఈ సినిమా కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకునే అవకాశాలు కనబడడం లేదు. ఇలా ఈ సంస్థ వారు ఈ సంవత్సరం రవితేజ , కావ్య ఇద్దరికీ కూడా చేదు అనుభవాన్ని మిగిల్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: