స్టార్ హీరో అవ్వాల్సిన శోభన్ బాబు కొడుకును .. ఇండస్ట్రీలో కి రాకుండా చేసింది ఎవరు ?

Amruth kumar
( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
మన తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎంతో మంది హీరో లు వారికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు . ఎంతో మంది అగ్ర హీరోలుగా ఎదిగారు . అయితే వారి లో అందగాడి గా సోగ్గాడి గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దివంగత శోభన్ బాబు .. కుటుంబ కథ సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు శోభన్ బాబు .. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది . అలా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు శోభన్ బాబు .

అయితే అదే క్రమంలో కృష్ణ వంటి స్టార్ హీరోలతో మల్టీ స్టార్ సినిమా లు చేస్తూనే హీరో గా కూడా తనని తాను ప్రూవ్ చేసుకున్నారు . ఇక సోగ్గాడు సినిమాతో తనని తాను స్టార్ హీరోగా మార్చుకున్నారు శోభన్ బాబు . అలానే సినిమాలు ద్వారా వచ్చే డబ్బుల్ని శోభన్ బాబు భూమి మీద ఇన్వెస్ట్ చేసి ఇండస్ట్రీలో నే భారీ ధనిక హీరోగా ప్రత్యేకతను చాటుకున్నారు.

అయితే శోభన్ బాబు నట వారసుడి గా ఆయన కొడుకు కరుణ శేషు ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇవ్వాలి .. కానీ అనుకోని కారణాల వల్ల ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదు. అయ‌న ఇద్ద‌రు పిల్లలు కూడా ఇండస్ట్రీ లోకి రాలేదు .. సినిమా అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నా కూడా శోభన్ బాబు ఇంట్రెస్ట్ ని మార్చేస్తే ఈ బిజినెస్ ల మీద ఆసక్తి పెట్టే విధంగా మార్చారు. శోభన్ బాబు వలన శేషు ఇండస్ట్రీ కి రాలేద ని పలువురు సీనియర్ హీరోలు కూడా  అప్ప‌టిలో చెప్ప‌కొచ్చారు . శోభన్ బాబు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఒక చెరగని ముద్ర వేశారని  చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: