చరణ్ - పవన్ సినిమాల్లో చిరు ఫేవరెట్ సినిమా ఏదో తెలుసా..?

Amruth kumar
. . ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
తెలుగు చిత్ర పరిశ్రమ  పేరు చెప్తే ఎన్టీఆర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడాలి ..  ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు . ఆ తర్వాత మెగా బ్రాండ్ తో చాలా మంది హీరో లో ఇండస్ట్రీలోకి వచ్చారు . అలా వారిలో చిరంజీవి తర్వాత అంతటి స్టారడం తెచ్చుకున్న వారిలో పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ కూడా ఒకరు . ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా కొనసాగుతూ సినిమాలు కూడా చేస్తున్నాడు .

ఇక రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా హీరో గా వరుస క్రేజీ సినిమాల తో బిజీగా ఉన్నాడు . అయితే గతంలో చిరంజీవి చరణ్ - పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల లో ఆయనకు ఇష్టమైన సినిమాలు ఏమిటో చెప్పుకోచ్చాడు .. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది .  అందులో చిరు మాట్లాడుతూ నాకు పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ , తమ్ముడు , జల్సా సినిమాలు ఎంతో ఇష్టం. అలానే జల్సా సినిమా ను ఎంతో చేశానని కూడా చెప్పారు . ఇక రామ్ చరణ్ నటించి న సినిమాల‌ విషయానికి వస్తే మగధీర సినిమా అంటే నాకు చాలా ఇష్టమని ఆయన అన్నారు.

అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎవరు ఊహించని విజయం అందుకోవటం నాకు చాలా ఆనందంగా ఉందని కూడా ఆయన అన్నారు . ఇక రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి నటిస్తే చూడాలని ఉందని కూడా ఆయన ఆశపడ్డారు . ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభ‌రా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాతో చిరంజీవి ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: