నాగ్ రిక్వెస్ట్ చేసిన నో చెప్పిన డైరెక్టర్.. వేరే డైరెక్టర్ తో అదే మూవీని రీమిక్ చేసే బ్లాక్ బస్టర్..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే . నాగార్జున తన కెరీర్లో కొన్ని రీమిక్ సినిమాలలో కూడా హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే . ఇది ఇలా ఉంటే ఒక రీమిక్ సినిమాను ఒక దర్శకుడి తో నాగార్జున చేయాలి అనుకున్నాడ ట అందులో భాగంగా ఆ దర్శకుడిని సంప్రదించాడట . ఆయన మాత్రం ఆ సమయం లో అది కుదరదు అని చెప్పడంతో వేరే దర్శకుడి తో అదే సినిమాను రీమిక్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడట. అసలు ఆ సినిమా ఏది .? ఆ దర్శకుడు ఎవరు .? అసలేం జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం నాగార్జున హీరోగా నగ్మా హీరోయిన్గా ఈ వి వి సత్యనారాయణ దర్శకత్వంలో వారసుడు అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇది ఒక రీమిక్ సినిమా. ఇక ఈ సినిమాను నాగార్జున మొదటగా బి గోపాల్ దర్శకత్వంలో చేయాలి అనుకున్నాడట. అందులో భాగంగా గోపాల్ ను సంప్రదించి విషయం మొత్తం చెప్పాడట. ఇక గోపాల్ కి కూడా నాగార్జున తో సినిమా చేయాలి అని ఉందట. కాకపోతే ఆ సమయంలో అతను చాలా సినిమాలకు కమిట్ అయి ఉండడంతో చేయలేను అని చెప్పాడట. దానితో ఏమీ చేయలేని నాగార్జున ఈ సినిమా రీమిక్ దర్శకత్వ ఈ వీ వీ సత్యనారాయణ కు అప్పగించాడట. ఆ తర్వాత వారసుడు అనే టైటిల్ తో రీమేక్ అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: