అందాల ముద్దుగుమ్మ
శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె
తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టిన తెలుగు సినిమాల ద్వారా మొదటి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగు ,
తమిళ ఇండస్ట్రీలలో అద్భుతమైన నటిగా గుర్తింపును సంపాదించుకుంది. పోయిన సంవత్సరం ఈ
బ్యూటీ వీరసింహా
రెడ్డి , వాల్టేరు వీరయ్య , హాయ్
నాన్న , సలార్ అనే సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ నాలుగు
మూవీ లు కూడా అద్భుతమైన విజయాలు అందుకోవడంతో ఈ
బ్యూటీ క్రేజ్ అద్భుతమైన స్థాయిలో పెరిగింది. ఇకపోతే తాజాగా ఈ
బ్యూటీ నచ్చిన వ్యక్తితో డేట్ కి వెళ్ళినప్పుడు ఎదురైన కొన్ని వింత అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. తాజాగా
శృతి హాసన్ మాట్లాడుతూ ... కొంత మంది వ్యక్తులతో డేట్ కి వెళ్ళినప్పుడు ఖర్చులన్నీ తనతోనే పెట్టించేవారని ఇటీవల ఈమె తెలిపింది. ఆడవాళ్లు ఆర్థికంగా ఎంతో స్వతంత్రులుగా ఉండాలి.
ఆర్థిక విషయాలలో ఎప్పుడూ మహిళలు ఇతరులపై ఆధార పడకూడదు. నేను చాలా సంవత్సరాల నుండి నా డబ్బును నేనే సంపాదించుకుంటున్నాను. ఇక ఎప్పుడు ఎవరితో డేట్ కి వెళ్లిన నాతోనే డబ్బులు కట్టించేవారు. ఎవరితోనైనా డేట్ కి వెళితే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అన్నట్లు వారు చూసేవారు. మొదట్లో నేను కూడా ఎదుటి వ్యక్తి ఏ మాత్రం అడగకుండానే అన్నిటికి డబ్బులు చెల్లిస్తూ వచ్చేదాన్ని. నా దృష్టిలో అది కూడా ఓ రకమైన ప్రేమే. ఇక కొంత కాలం గడిసాక నాతోనే డబ్బులు ఖర్చు పెట్టించావు అని అడిగితే అదంతా నువ్వు ఇష్టపడి చేస్తున్నావు అనుకున్నాను అంటారు. ఇలాంటి అనుభవాలు అనేకం ఎదురైన తర్వాత డబ్బులు విషయంలో ఎంతో క్లారిటీగా ఉండాలి అని నాకు అర్థం అయింది అని శ్రుతి హాసన్ తాజాగా చెప్పుకొచ్చింది.