చరణ్ ని పెళ్లి చేసుకోవడానికి..ఉపాసనకు సురేఖ అలాంటి కండిషన్ పెట్టిందా..? ముందు జాగ్రత్త అంటే ఇదే..!

Thota Jaya Madhuri
టాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ కపుల్స్ ..లవబుల్ కపుల్స్ ..క్యూట్ కపుల్స్ చాలామంది ఉన్నారు. అయితే చాలా చాలా ట్రెడిషనల్ రెస్పెక్టబుల్ కపుల్స్ మాత్రం ఒకరే ఉన్నారు. వాళ్లే ఉపాసన - రాంచరణ్ . పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వీళ్ళిద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులు . ఆ స్నేహం ప్రేమగా ..ప్రేమ పెళ్లిగా మారి వీళ్లను భార్యాభర్తలు గా మార్చేసింది . ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఒక పాప .


ఆమె పేరు క్లింకార . చాలా చాలా ముద్దుగా ఇష్టంగా పెంచుకుంటూ ఉన్నారు ఉపాసన - రాంచరణ్ తమ పాపను అని చెప్పడంలో సందేహం లేదు . ఉపాసన అయితే పాపపైనే ప్రాణాలు అన్నీ పెట్టుకుని ఉంది . ఎక్కడికి వెళ్లినా సరే పాపను చాలా కేర్ఫుల్ గా చూసుకుంటూ వస్తుంది . అయితే వీళ్లది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ . రామ్ చరణ్ - ఉపాసనని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లో ఒప్పించడానికి ఎక్కువగా సమయం పట్టలేదట .


చిరంజీవికి చెప్తే ప్రతాపరెడ్డి మనవరాలను తెలిసి చాలా చాలా హ్యాపీగా ఫీలయ్యారట . అయితే సురేఖ మాత్రం సరదాగా ఉపాసనకు ఒక బిగ్ కండిషన్ పెట్టిందట . ఆ కండిషన్ కి ఒప్పుకుంటేనే చరణ్ తో పెళ్లి అంటూ ఉపాసనకు స్ట్రైట్ గానే చెప్పిందట ." మా చరణ్ చాలా మొండివాడు.. వద్దు అన్న పనినే చేస్తాడు.. అది తప్పు అని తెలిసిన కూడా అదే పని చేస్తాడు.. నీట్ నెస్ ఉండదు.. నువ్వే వాడిని కంట్రోల్ లో స్ట్రిక్ట్ గా పెట్టాలి.. ఏ పనైనా చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించేలా చేయాలి. అలా నువ్వు నా కొడుకుని మారుస్తాను అంటేనే పెళ్లి చేసుకో "అంటూ సరదాగా కండిషన్ పెట్టిందట . ఉపాసన కూడా నవ్వుతూనే ఆ కండిషన్ ని యాక్సెప్ట్ చేసిందట . అయితే ఉపాసన ఆ కండిషన్ ని తెగ సీరియస్ గా తీసుకుంది . ఇప్పుడు ఉపాసన ఏది చెప్తే అదే రామ్ చరణ్ పాటిస్తూ వస్తున్నాడు . మరీ ముఖ్యంగా క్లింకార విషయంలో ఉపాసన దే అప్పర్ హ్యాండ్..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: