ఆ తప్పు వల్ల భారీగా నష్టపోతున్న బాలయ్య నిర్మాత.. ఏకంగా అంత నష్టమా?
అయితే మొదట ఈ సినిమాకు మరో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుని నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే రిలీజ్ డేట్ ను వేర్వేరు కారణాల వల్ల మార్చిన నేపథ్యంలో ఈ సినిమాకు ఓటీటీ సంస్థ నుంచి సాధారణంగా వచ్చే మొత్తం కంటే 3 నుంచి 4 కోట్ల రూపాయలు తక్కువ మొత్తం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. రిలీజ్ డేట్ విషయంలో పొరపాటు వల్ల బాలయ్య బాబీ కాంబో మూవీ నిర్మాత భారీగా నష్టపోనున్నారని చెప్పవచ్చు.
3 నుంచి 4 కోట్ల రూపాయలు అంటే చిన్న మొత్తం కాదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2025 సంక్రాంతి రేసులో నిలిచే ఈ సినిమాపై నిర్మాతలు ఒకింత భారీ స్థాయిలోనే ఆశలు పెట్టుకున్నారు. బాలయ్య సినిమాలకు ఈ మధ్య కాలంలో బిజినెస్ సైతం అంచనాలకు మించి జరుగుతుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.
బాలయ్య నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఓకే చెబుతూ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు సైతం ఫీలవుతున్నారు. బాలయ్య నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునే పాత్రలకు ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారనే సంగతి తెలిసిందే. సితార బ్యానర్ లో బాలయ్య నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.