మైండ్ బ్లోయింగ్: 1990లోనే సిల్క్ స్మిత నెల ఇంటి అద్దె ఎంత ఉండేదో తెలుసా..!
ఎంతో మంది డాన్సర్లు సిల్క్ స్మిత చూసి ఇండస్ట్రీలో వచ్చారు. అయితే ఎవరూ కూడా సిల్క్ స్మిత బ్రాండ్ ఇమేజ్ టచ్ చేయలేకపోయారు. అయితే ఆమె కెరీర్ గురించి ఎంతోమందికి ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయి. తాజాగా డిస్కో శాంతి ఇంటర్వ్యూలో సిల్క్ స్మిత గురించి కొన్ని సంచలన విషయాలు బయట పెట్టారు. సిల్క్ స్మిత చాలా కలుపుగోలుగా ఉంటుంది. ఆమెను అక్క అని పిలిచే దాన్ని అని.. పెళ్లి విషయంలో ఆమె ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో నాకు అర్థం కాలేదని వాపోయింది శాంతి.
సిల్క్ స్మిత ఏ విషయాలు నా దగ్గర దాచేది కాదు .. ఆమె భర్త గురించి అతనికి ముందే ఉన్న పిల్లల గురించి నాతో చెప్పింది అని డిస్కో శాంతి చెప్పింది. అప్పట్లోనే సిల్క్ స్మిత లక్షల్లో పారితోషకం తీసుకునేదట. రోజుకు ఆమెకు లక్ష నుంచి మూడు లక్షల రూపాయలు వచ్చేదట. ఆ రోజుల్లోనే సిల్క్ స్మిత చెన్నైలో నెలకు 5 లక్షల అద్దె కట్టి ఇంట్లో ఉండేదట. మేము ఆమె స్థాయికి చేరుకునేందుకు 10 ఏళ్లకు పైగా పట్టింది.. అప్పుడప్పుడు సొంత ఇల్లు కొనుక్కోవచ్చు కదా అని అడిగితే ఆమె పట్టించుకునేది కాదని డిస్కో శాంతి చెప్పింది. సిల్క్ స్మితది చాలా లగ్జరీ లైఫ్ అని.. మంచంపై నోట్లోకట్లు పరుచుకుని పడుకునేది.. అవకాశాల కోసం తిరిగినప్పుడు ఎవరు నన్ను పట్టించుకోలేదు ఇప్పుడు నేనే డబ్బులు పై పడుకుంటున్నాను అని చెప్పేదని డిస్కో శాంతి తెలిపింది.