బ‌న్నీ దెబ్బ‌కు అడ్ర‌స్ లేకుండా పోయిన ఈ హీరోయిన్‌ను గుర్తు ప‌ట్టారా ?

RAMAKRISHNA S.S.
సినీ రంగంలో ఒకప్పుడు ఒకటి రెండు సినిమాలలో రాణించి ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లు అందరూ చాలా త్వరగా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు నడుస్తుంది అంతా సోషల్ మీడియా యుగం  కావడంతో మళ్లీ వారు సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ సినీ అభిమానులు తమను ఇంకా గుర్తు పెట్టుకునేలా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ డిజాస్టర్ హీరోయిన్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హడావిడి మొదలుపెట్టింది. గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా వరుడు. ఎవరు మర్చిపోయినా బన్నీ అభిమానులు మాత్రం ఈ సినిమాను మర్చిపోలేరు.

భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీనికి తోడు ఈ సినిమా రిలీజ్ కి ముందు హీరోయిన్ ఫేస్ కనిపించకుండా మూవీ పై హైప్‌ పెంచారు. సినిమా ధియేటర్లలోకి వచ్చాక ఇంటర్వెల్ ముందు హీరోయిన్ మొహాన్ని రివీల్‌ చేశారు. ఎంత సస్పెన్స్ మెయింటెన్ చేసినా ఈ సినిమా వర్కౌట్ కాలేదు. వరుడు అల్లు అర్జున్ కెరీర్ లోనే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. పంజాబ్లోని అమృత్‌స‌ర్ కు చెందిన భాను శ్రీ మెహ్రా కు ఇదే మొదటి తెలుగు సినిమా. వరుడు కంటే ముందు ఆమె బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటించింది. వరుడు నిరాశ పరచడంతో భాను శ్రీకి తెలుగులో పెద్దగా అవకాశాలు కూడా రాలేదు.

ఆ త‌ర్వాత ఆమె తెలుగులో చిల్కూరు బాలాజీ - ప్రేమతో చెప్పన - మహారాజా శ్రీ గాలిగాడు - లింగడు - రామలింగడు - బ్రదర్ ఆఫ్ బొమ్మాళి - గోవిందుడు అందరి వాడేలే - రన్ - మిస్ ఇండియా తదితర సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా త‌ళుక్కున మెరిసింది. భాను శ్రీ చివరగా 2022లో 10th క్లాస్ డైరీస్ అనే సినిమాలో కనిపించింది. సినిమాలకు దూరంగా ఉన్న భానుశ్రీ  యూట్యూబ్ చానెల్ పెట్టుకుని తన వ్లాగ్స్ చేసుకుంటోంది. ట్రావెలింగ్ వీడియోలతో హ‌డావిడి చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆమె త‌న ట్విట్టర్ అకౌంట్ ను అల్లు అర్జున్ బ్లాక్ చేశాడంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: