త్రిష విజయ్ ఎఫైర్ వార్తల మీద ఇప్పటికే కోలీవుడ్లో చాలామంది అభిమానులు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా త్రిష కనిపిస్తే కొడదాం అన్నంత రేంజ్ లో విజయ్ వీరాభిమానులు రెచ్చిపోతున్నారు. ఎందుకంటే త్రిష విజయ్ కాపురంలో చిచ్చు పెట్టి భార్యకి దూరమయ్యేలా చేసింది అనే అపోహ ప్రేక్షకుల్లో బలంగా వెళ్ళిపోయింది. అయితే విజయ్ త్రిష మధ్య ల మధ్య అలాంటి ఇల్లీగల్ ఎఫైర్ ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం త్రిష పేరు కోడైకూస్తుంది. అయితే వీరిద్దరు ఎఫైర్ వార్తలు వినిపిస్తున్న వేళ త్రిష చేసిన కామెంట్లు మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.నాకు ఏ దిక్కు లేదు నేను గుడ్డిగా విజయ్ ని నమ్ముతున్నా అంటూ త్రిష మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ మాటలు విన్న నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.అయితే ఈ మాటలు త్రిష ఎందుకు మాట్లాడింది.. అవి పరోక్షంగా అభిమానులు ఎందుకు అలా కనెక్ట్ చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. రీసెంట్ గా త్రిష విజయ్ నటించిన ది గోట్ మూవీ లో స్పెషల్ పాత్రలో అలాగే ఐటెం సాంగ్ లో కూడా చేసింది.
అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర సంఘటన బయటపెట్టింది. నేను విజయ్ తో ది గోట్ మూవీలో చేస్తున్న సమయంలో ఆయనతో కొన్ని ఫైటింగ్స్ సన్నివేశాల్లో నటించాల్సి ఉంది. అయితే ఫైటింగ్ చేసే సమయంలో నా నడుముకి తాడు కట్టినప్పటికీ కూడా నాకు ఎక్కడో తేడా కొడుతోంది.ఇక ఎంత భయం ఉన్నా సరే విజయ్ ని గుడ్డిగా ఫాలో అయ్యి ఆయనతో పాటు పై నుండి దూకేశాను అంటూ మాట్లాడింది.అయితే త్రిష మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్ అవ్వడంతో సినిమా వరకే కాదు నువ్వు పర్సనల్ లైఫ్ లో కూడా విజయ్ ని గుడ్డిగా నమ్మేసి ఆయన జీవితాన్ని అతలాకుతలం చేసేసావు అంటూ ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఇక గత కొద్ది సంవత్సరాల నుండి విజయ్ త్రిష మధ్య ఎలాంటి రూమర్లు వినిపించలేదు. కానీ ఎప్పుడైతే త్రిష మళ్లీ విజయ్ హీరోగా చేసిన లియో మూవీలో ఆయన సరసన నటించిందో అప్పటినుండి మళ్ళీ వీరిద్దరి మధ్య క్లోజ్ బాండింగ్ ఏర్పడినట్లు తెలుస్తోంది. అందుకే విజయ్ గురించి ఏ చిన్న పోస్ట్ పెట్టినా ఆయన గురించి ఏ చిన్న మాట మాట్లాడినా కూడా కోలీవుడ్లో కాంట్రవర్సీ అయిపోతుంది. మరి చూడాలి త్రిష విజయ్ ల వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తుందో