అల్లు వారి ఇంట్లో చిరంజీవికి దక్కని స్థానం ఆ స్టార్ హీరోకి దక్కింది మరి!
అల్లు అర్జున్ ఎదుగుదలకు సొంత కృషి ఓ కారణం అయితే, మెగా ఫామిలీ కూడా పరోక్షంగా కారణం అని అందరికీ తెలిసిందే. పైగా మనోడికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ మెగా హీరో అనే ట్యాగ్ ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. అవును, మెగా హీరోలందరికీ ఒక సామాజిక వర్గం అభిమానులు అయితే తప్పకుండా ఉంటారు. అయితే కొన్నాళ్లుగా మెగా హీరోలకు అల్లు అర్జున్ దూరమవుతూ వస్తున్న సంగతి చాలా స్పష్టంగా అర్ధం అవుతోంది. మెగా హీరో అనే ట్యాగ్ వదిలించుకోవాలని అనుకుంటున్నాడేమో గానీ ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే కొణిదెల - అల్లు కుటుంబాల మధ్య మనస్పర్థలు కూడా తలెత్తుతున్నాయి అని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. మరీ ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలపడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. ఈ నేపథ్యంలో పుష్ప చిత్రం పై పవన్ కళ్యాణ్ పరోక్షంగా విమర్శలు కూడా గుప్పించాడు. ఒకప్పుడు హీరోలు అడవులను పెంచి, అభివృద్ధి చేసే పాత్రలు చేసేవారు. ఇప్పటి హీరోలు మాత్రం చెట్లను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం అని పవన్ చాలా ఘాటుగా స్పందించడం జరిగింది.
ఇక జనసేన నాయకులు అయితే ఓపెన్ గానే అల్లు అర్జున్ పై విమర్శల దాడికి దిగడం మనం చూశాం. ఈ కోల్డ్ వార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 పై ప్రభావం చూపుతుందనే వాదన కూడా ఇపుడు నడుస్తోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అల్లు అర్జున్ ఇంట్లో సీనియర్ ఎన్టీఆర్ ఫోటో కనబడడం కొసమెరుపు. ఉత్తర ప్రదేశ్ కి చెందిన ఓ అభిమాని 1600 కిలోమీటర్లు అల్లు అర్జున్ ని కలిసేందుకు సైకిల్ పై రాగా, సదరు అభిమానిని అల్లు అర్జున్ స్వయంగా కలిశాడు. ఈ క్రమంలో ఫోటోలకు పోజిచ్చాడు. దాంతో యూపీ అభిమానితో అల్లు అర్జున్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సదరు ఫోటోలో సీనియర్ ఎన్టీఆర్ ఫోటో కనిపించింది. అదే విధంగా అల్లు అర్జున్ ఆఫీస్ లో కూడా ఎన్టీఆర్ పెద్ద ఫోటో ఫ్రేమ్ ఒకటి ఉందట. అయితే, ఆయన ఫోటో ఇండడం తప్పు కాదుగానీ మెగాస్టార్ చిరంజీవి ఫోటో లేకపోవడం ఇపుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.