టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించి ఇండియా వ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రభాస్ పోయిన సంవత్సరం చివరన సలార్ పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సంవత్సరం ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకొని ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం ప్రభాస్ , మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ సినిమాలో, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో , సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే ఓ మూవీలో నటించడానికి ప్రభాస్ రెడీగా ఉన్నాడు. ఇకపోతే ప్రభాస్ పుట్టిన రోజు అక్టోబర్ 23 వ తేదీన అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన చాలా సినిమాలను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ కలక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇక ప్రభాస్ నటించిన సినిమాలను రీ రిలీస్ చేసినట్లయితే దేవర సినిమా కలెక్షన్లు కాస్త పడిపోయే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి ప్రభాస్ సినిమాల వల్ల దేవర సినిమా కలెక్షన్లపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనేది చూడాలి.