నమ్మకాని కేరాఫ్ అడ్రెస్ అయిన శేఖర్ కమ్ముల..ఆ హీరోయిన్ ని అంత దారుణంగా మోసం చేశాడా..?

Thota Jaya Madhuri
శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పద్ధతికి మరో మారుపేరు . ఎంతలా అంటే శేఖర్ కమ్ముల ఎవరిని హర్ట్ చేయరు . ఎవరిని హర్ట్ చేసే కంటెంట్ అసలు తన సినిమాలోనే పెట్టడు . అసలు ఎవరైనా హర్ట్ అవుతాడు అని తెలిస్తే ముందుగానే శేఖర్ కమ్ముల హర్ట్ అయిపోయి అలాంటి సీన్స్ తెరకెక్కించకుండా ఉంటారు.  అంతా మంచిమనిషి . ఇప్పటివరకు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన సినిమాల లిస్టు చూస్తే చాలా చిన్న కాన్సెప్ట్ తోనే పెద్ద స్టోరీని అల్లేస్తాడు.  అది కూడా మన ఇంట్లో జరిగే సిచువేషన్.. సీన్స్ ని తెరపై చాలా రియలిస్టిక్ గా తెరకేకిస్తారు .


ఆనంద్ ఓ మంచి కాఫీలాంటి సినిమా ,గోదావరి ,హ్యాపీడేస్ ,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ , లవ్ స్టోరీ , ఫిదా ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నెన్నో సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.  అయితే ప్రెసెంట్ కుబేర సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు శేఖర్ కమ్ముల . ధనుష్ ఈ సినిమాలో హీరోగా కనిపిస్తున్నాడు .  ఈ సినిమా అయిపోయిన వెంటనే శేఖర్ కమ్ముల మరొక స్టార్ హీరో తో సినిమాకి కమిటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు శేఖర్ కమ్ముల ఒక హీరోయిన్ ని మోసం చేశాడు అన్న వార్త ఇప్పుడు హాట్ హాట్ గా హల్చల్ చేస్తుంది.


శేఖర్ కమ్ముల.. సాయి పల్లవిని తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు . అంతేకాదు ఆమెతో లవ్ స్టోరీ అనే సినిమాను కూడా తెరకెక్కించారు.  అయితే బ్యాక్ టు బ్యాక్ సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చేసిన శేఖర్ కమ్ముల మళ్లీ ఆమెను ధనుష్ నటించిన కుబేర సినిమాలో హీరోయిన్గా పెట్టుకుంటారు అని అంతా అనుకున్నారు. టాక్ కూడా  అలాగే నడిచింది.  శేఖర్ కమ్ముల కూడా ఆ వార్తలను వేలెత్తి చూపించకపోవడంతో ఇదంతా నిజమే అనుకున్నారు . కానీ లాస్ట్ మినిట్ లో ఈ సినిమాలో హీరోయిన్ ని మార్చేశారు.


దీంతో సోషల్ మీడియాలో అందరూ సాయి పల్లవి ఫాన్స్ ..శేఖర్ కమ్ముల చీట్ చేశాడు ఆమెను అంటూ తెగ కామెంట్స్ చేశారు . అంతేకాదు ఇప్పటికీ శేఖర్ కమ్ముల పై సాయి పల్లవి ఫ్యాన్స్ గుర్రుగా ఉండడం గమనార్హం . ఈ కోపం తీరాలి అంటే సాయి పల్లవి తో మరొక క్రేజీ సినిమాను తీయాల్సిందే శేఖర్ కమ్ముల.  లేకపోతే పరిస్థితులు చే జారిపోతుంది.. సిచువేషన్ హ్యాండిల్ చేయలేని స్థాయికి వెళ్ళిపోతుంది అంటున్నారు సాయిపల్లవి ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: