ఓజీ - సాహో సినిమాకు లింకా.. నిజమైతే ఫాన్స్ కి పూనకాలే..!

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో ఓజి సినిమాలో నటిస్తూ ఉన్నారు.. అయితే చాలా కాలం తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్లో ఇటీవలే వైజాగ్ లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ సినిమాని త్వరగా పూర్తిచేయాలనే భావనతో అటు పవన్ కళ్యాణ్ డైరెక్టర్ సుజిత్ కూడా ఉన్నారట. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని అనుకున్నప్పటికీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదని సమాచారం. మందు ఓజి మొదటి భాగాన్ని పూర్తి చేసి రిలీజ్ చేశాక సక్సెస్ అయితేనే రెండో భాగం గురించి ఆలోచనలో డైరెక్టర్ సుజిత్ ఉన్నట్లు సమాచారం.

అయితే ఇదంతా ఇలా ఉండగా గత కొన్ని నెలలుగా ఓజి సినిమాకి ప్రభాస్ నటించిన సాహూ సినిమాకి మధ్య లింక్ ఉందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు మల్టీ వర్క్స్ మూవీస్ గా డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓజి సినిమా మొదలు పెట్టిన సమయంలో ఈ విషయం ఎక్కువగా వినిపించింది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం గూగుల్ లో మాత్రం ఓజి మూవీ కాస్టింగ్ అనే టైప్ చేస్తే అటు పవన్తో పాటు ఇమ్రాన్ హస్మి ,ప్రభాస్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

ఈ విషయం విన్న అటు ప్రభాస్ అభిమానులు పవన అభిమానులు అందుకు సంబంధించిన విషయాన్ని అయితే వైరల్ గా చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఫాన్స్ కి పూనకాలే అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ డైరెక్టర్ సుజిత్ ఈ ఇద్దరు స్టార్ హీరోల మల్టీస్టారర్ చేస్తే బాగుంటుంది అంటూ మరి కొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఓజి సినిమా రిలీజ్ డేట్ పైన అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ డేట్స్  మీద ఈ సినిమా ఆధారపడిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: