పై ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తున్న స్టార్ హీరోయిన్..?

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం ఎంతో మంది సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇకపోతే పై ఫోటోలో ఉన్న చిన్న అమ్మాయి ఎవరు అని అనుకుంటున్నారా .? ఆమె డాన్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని , డాన్స్ షో లలో కూడా పాల్గొని అద్భుతమైన రీతిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత మలయాళ సినిమాల ద్వారా సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఈమె అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించింది.

ప్రస్తుతం హిందీ సినిమాలో కూడా ఈమె నటిస్తోంది. మరి ఇంతకు అంత గొప్ప స్థాయికి ఎదిగిన ఆ ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా .? ఆమె సాయి పల్లవి. ఈమె డీ డాన్స్ ప్రోగ్రాం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ప్రేమమ్ అనే మలయాళ సినిమాలో నటించి ఈ మూవీ ద్వారా సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ఫిదా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ తో మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాతో సాయి పల్లవి తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ వచ్చింది.

ఆ తర్వాత ఈమె కొన్ని తెలుగు సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అద్భుతమైన స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీ సినిమాలలో కూడా నటిస్తుంది. ఇప్పటివరకు సాయి పల్లవి ఎన్నో సినిమాల్లో నటించిన ఎప్పుడు కూడా స్కిన్ షో వైపు చూడకుండా కేవలం క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ కి అదిరిపోయే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: