జూనియర్ దర్శకుల ముందు సీనియర్స్ తేలిపోతున్నారా.. ఇప్పటికైనా అది సరి చేసుకుంటారా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సీనియర్ డైరెక్టర్ల కంటే కూడా కొత్త దర్శకులు అద్భుతమైన విజయాలను అందుకుంటున్నారు. కొంత మంది సీనియర్ దర్శకులను మినహాయిస్తే చాలా వరకు సీనియర్ దర్శకులు అపజయాలనే అందుకుంటూ కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు. ఇక కొత్త దర్శకుల విషయానికి వస్తే వారు తక్కువ బడ్జెట్ తో సినిమాలను నిర్మిస్తున్న ప్రజలకు కనెక్ట్ అయ్యే సినిమాలను రూపొందిస్తూ ఉండడంతో అలాంటి మూవీ లకే ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కుతుంది. ఈ మధ్య కాలంలో కొత్త దర్శకులు రూపొందించిన తక్కువ బడ్జెట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్న సందర్భాలే ఎక్కువ ఉన్నాయి.

ఇక సీనియర్ డైరెక్టర్లు అద్భుతమైన స్థాయిలో కష్టపడి సినిమాలను తెరకెక్కిస్తున్న వారు రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లను తెరకెక్కిస్తూ ఉండడంతో అలాంటి సినిమాలను జనాలు పెద్దగా ఇష్టపడడం లేదు. దానితో వారు ఎంతో కష్టపడి సినిమాలను తెరకెక్కించిన ఆ మూవీ లు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాలను అందుకోవడం లేదు. ఎవరు ఒకరు ఇద్దరు సీనియర్ డైరెక్టర్లను మినహాయిస్తే ఎక్కువ శాతం మంది సీనియర్ డైరెక్టర్లు ఈ మధ్య కాలంలో బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలనే అందుకుంటున్నారు.

ఇక దానితో కొంత మంది సినీ ప్రేమికులు సీనియర్ డైరెక్టర్లలో మంచి టాలెంట్ ఉన్న వారు చాలా మంది ఉన్నారు. వారు రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లను తీసే కంటే కూడా డిఫరెంట్ స్టోరీ లతో సినిమాలను తెరకెక్కిస్తే వారు అదిరిపోయే  బ్లాక్ బస్టర్ విజయాలను అందుకునే అవకాశాలు ఉన్నాయి అని వారు అలాంటి ప్రయోగం చేస్తే బెటర్ అనే వాదనను కూడా వినిపిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో సీనియర్ డైరెక్టర్స్ రొటీన్ కమర్షియల్ సినిమాలను వదిలేసి కొత్తరకం సినిమాలు తిస్తెనే సీనియర్ డైరెక్టర్స్ ఇంకా కాలం కెరీర్ ను కొనసాగించే అవకాశం ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: