ప్రభాస్ పుట్టినరోజుకు ఆ స్టార్ హీరోయిన్ సర్ప్రైజ్ గిఫ్ట్.. అభిమానుల కోరిక నెరవేరబోతుందిగా..!

Amruth kumar
. . . ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస‌ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు . ఈ సంవత్సరం సలార్ , కల్కి సినిమాల తో బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫామ్ లోకి వచ్చిన ప్రభాస్ తర్వాత సినిమా లతో కూడా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీగా ఉన్నాడు . అంతేకాకుండా 2025 చివర్లో ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ రాబోతుందని కూడా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి దసరా కానుకగా ప్రకటించింది . ఇక గతంలో ప్రభాస్ పెళ్లి పై ఎన్నో రూమర్లు కూడా వచ్చాయి . అలాగే ప‌లువురు హీరోయిన్లతో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయిందనే వార్తలు కూడా వచ్చాయి .

ఇక మ‌రీ ముఖ్యంగా ప్రభాస్ - అనుష్క పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ఇప్పటికే ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు . కాని అనుష్క మాత్రం ప్రభాస్ నాకు బెస్ట్  ఫ్రెండ్ అంటూ ఆ వార్తల ను కొట్టి పడేసింది . అయితే ఎప్పుడో మరి రెండు రోజుల్లో ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఊహించని అప్డేట్ కూడా రానుందట. అప్డేట్ కూడా ప్రభాస్ కు ఎంతగానో దగ్గరైన స్టార్ హీరోయిన్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రెబల్ స్టార్ అభిమానులు ప్రభాస్ పుట్టినరోజును వారోత్సవాలుగా చేస్తున్నారు.

ఆయన నటించిన ఆరు సినిమాలు రీ రిలీజ్ కాబోతున్నాయి. అలాగే సలార్ 2, స్పిరిట్ సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పాస్టర్ లు కూడా విడుదల చేయబోతున్నారు. వీటి తో పాటు ఆ స్టార్ హీరోయిన్ చెప్పబోయే న్యూస్ అన్నిటికన్నా స్పెషల్ అని తెలుస్తుంది . ఆ వార్త తర్వాత ప్రభాస్ అభిమానుల కల నెరవేరుతుంద ని కూడా అంటున్నారు . ఇక మరి ఆ స్టార్ హీరోయిన్ అభిమాను లకు ఎలాంటి న్యూస్ అందిస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: