లోకేష్ కనగరాజ్ మరో సంచలనం.. ఎన్టీఆర్ తో భారీ స్కెచ్ వేసాడుగా..!

Amruth kumar
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సందీప్ కిషన్ హీరో గా వచ్చిన నగరం మూవీ తో డైరెక్టర్ గా అడుగుపెట్టి సౌత్ ఇండియాలోనే స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు . ఇక‌ ప్రస్తుతం రజనీకాంత్ హీరో గా కూలీ సినిమా తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమా తర్వాత లోకేష్ సినిమామేటిక్ యూనివర్స్ లో భాగంగా ఖైదీ 2 , విక్రమ్ 2 , లియో సినిమాలకు సిక్వెల్ ను కూడా ప్లాన్ చేస్తున్నారు .  అయితే ఇప్పుడు కూలి సినిమా తర్వాత లోకేష్  ... మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ తో ఓ భారీ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది .

ఇక ఆ సినిమా ను తన LCU కు భిన్నంగా పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా చేయాలని భావిస్తున్నారట .  అలాగే ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా దేవర సక్సెస్ తర్వాత ప్రస్తుతం వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించనున్నాడు . వీటితో పాటు దేవర2 కు సంబంధించిన పనులు కూడా ప్రారంభం కానున్నాయి . ఇదే క్రమంలో లోకేష్ కనకరాజ్‌ సినిమా ను ప్రశాంత్ నీల్‌ మూవీ తో పాటు ఉంటుందని తెలుస్తుంది . ఇక ఇప్పటికే దేవరతో ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో సింగల్ గా రూ. 500 కోట్లకు పైగా భారీ కలెక్షన్ అందుకుని టాలీవుడ్ నుంచి  బాలీవుడ్‌కు మరో సవాల్‌ విసిరాడు.

అలాగే ప్రభాస్ తర్వాత ఈ స్థాయిలో కలెక్షన్ అందుకున్న హీరోగా నిలిచాడు. అలాగే త‌న త‌ర్వాత‌ సినిమాలతో కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. అలాగే కోలీవుడ్లో లోకేష్ కనకరాజ్‌ కాకుండా మరో దర్శకుడు వెట్రిమారన్‌ తో సినిమా చేయాలని ఉందని కూడా ఎన్టీఆర్ ప్రకటించాడు. అయితే ఎవరు ఊహించిన విధంగా ఇప్పుడు లోకేష్ కనకరాజ్‌ ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇక మరి ఎన్టీఆర్ తో లోకేష్  ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తారో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: