విజయ్ సేతుపతి వైఫ్ అరాచకం మామూలుగా లేదుగా.. ఫోటోల తోనే కైపెక్కిస్తుందిగా..!

Amruth kumar
సౌత్ ఇండియన్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆయన నటనకు పాన్ ఇండియా బాక్సాఫీస్ ఫిదా అయింది. యాక్టింగ్ తో ప్రతి ఒక్కరినీ మెప్పించారు. లేటుగా చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి  ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవ‌లే మహారాజా సినిమాతో బంపర్ హిట్‌ అందుకున్నారు.. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు. అలాగే తెలుగు , తమిళ సినిమాలతో పాటు హిందీలోనూ భారీ సినిమాలు నటిస్తున్నారు విజయ్ సేతుపతి. అయితే విజయ్ సేతుపతి విల‌న్‌ గా నటించిన సినిమాల్లో విక్రమ్ మూవీ కూడా ఒకటి.. లోక నాయకుడు కమలహాసన్ హీరోగా వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అందుకుంది. సినిమాకు లోకేష్ కగ‌కరాజ్‌ తెరకెక్కించారు.

ఇక ఈ సినిమాలో మల‌య‌ల‌ నటుడు ఫహద్ ఫాజిల్‌తో పాటు విజయ్ సేతుపతి కూడా నటించారు. అదేవిధంగా ఈ సినిమా క్లైమాక్స్ లో  స్టార్ హీరో సూర్య కూడా రోలెక్స్ గా అదిరిపోయే గెస్ట్ రోల్ లో మెప్పించారు. అయితే విజయ్ సేతుపతి ఈ సినిమాలో ఇద్దరు భార్యలు ఉంటారు. పైన ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టే ఉంటారు.. విజయ్ సేతుపతి పక్కన కూర్చోవడానికి గొడవ చేస్తే.. మనసు ఎడమవైపు ఉంటుంది అందుకే నిన్ను ఎడమవైపు కూర్చో పెట్టుకున్నానని భారీ డైలాగ్ కొడతాడు.

ఆమె బయట ఎలా ఉంటుందో తెలుసా.? ఆమె కోసం చాలా మంది సోష‌ల్ మిడియ‌ ను గాలిస్తున్నారు.  ఆమె పేరు మహేశ్వరి చాణక్యన్. తమిళ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు ఎంలో ఫేమ‌స్ .. అలాగే వీజే గా కెరీర్ ప్రారంభించిన ఆమె పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు తమిళ్ బిగ్ బాస్ లోనూ పాల్గొంది ఈ ముద్దుగుమ్మ. కాగా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అందాలు ఆరబోస్తూ కుర్రకారును కవ్విస్తుంది ఈ వయ్యారి. ఈ బ్యూటీ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: