"ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి".. జాన్వి కపూర్ కి భలే కొత్త సమస్య వచ్చిందే..!

Thota Jaya Madhuri
తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అన్నట్లు దాపురించింది జాన్వి కపూర్ ప్రసెంట్ పరిస్థితి . పాపం అమ్మడు అటు ముందు చూస్తే నుయ్యి ఇటు వెనక చూస్తే గొయ్యి అన్నలా దాపరించింది జాన్వి కపూర్ పరిస్ధితి. బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది.  అయినా ఒక్కటి కూడా హిట్ అందుకోలేదు . టాలీవుడ్ లోను దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చింది . పాపం ఈ సినిమా అమ్మడికి ఎలాంటి టాక్ దక్కించిందో మనకు తెలిసిందే.  అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ కి కొత్త సమస్య వచ్చి చేరిందట .


జాన్వి కపూర్ తెలుగులో దేవర సినిమాలో ట్రెడిషనల్ పాత్రలో మెరిసింది . ఆమె లుక్స్ కి చాలా చాలా మంది ఫిదా అయిపోయారు. సినిమా టాక్ అటూ ఇటూ ఉన్న దేవర సినిమాలో జాన్వి కపూర్ లుక్స్ కి పాజిటివ్ కామెంట్స్ దక్కాయి. దీంతో ఇప్పుడు తెలుగు డైరెక్టర్స్ అందరూ కూడా జాన్వికపూర్ కి ట్రెడిషనల్ లుక్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారట . అయితే మొదటినుంచి జాన్వి కపూర్ కి మోడ్రన్ పాత్రలు అన్న మోడ్రన్ లుక్ అన్న ఇష్టం . అందుకే హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది .


అడపాదడప ట్రెడిషనల్ లుక్స్ లో కనిపిస్తుంది కానీ జాన్వీకు మోడరన్ లుక్స్ బాగా ఇష్టమట . అయితే తెలుగులో మాత్రం అందరూ ఆమెకు ట్రెడిషనల్ పాత్రలు ఇస్తూ ఉండడంతో జాన్వి చాలా డిసప్పాయింట్ అవుతుందట . ఎప్పుడు ఒకే పాత్రలా..? కొంచెం డిఫరెంట్ గా ఉండాలిగా ..ఇంకా కొంచెం డోస్ పెంచుతూ క్యారెక్టర్స్ రాయండి అంటూ చెప్పుకొస్తుందట . కొన్ని ప్రాజెక్ట్స్ ని ఇలా ట్రెడిషనల్ పాత్రలు అయిన  కారణంగా రిజెక్ట్ చేసిందట . అసలకే అవకాశాలు రాక అల్లాడిపోతున్న జాన్వి కపూర్ కు వచ్చిన అవకాశాలు కూడా కొత్త ఆశలు కల్పించకపోవడంతో ఆమె నిరాశ వ్యక్తం చేస్తుంది. జాన్వికపుర్ ఈ  సిచువేషన్ నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: