రష్మిక ఆ హీరోయిన్ రుణం ఎప్పటికి తీర్చుకోలేదా..? అంత పెద్ద హెల్ప్ ఏం చేసిందో తెలుసా..?
ఆ బ్యూటీ మరెవరో కాదు కన్నడ హీరోయిన్ శ్రీ లీల . రష్మిక మందన్నా కూడా కన్నడ బ్యూటీనే. హాట్ బ్యూటీ గా ట్యాగ్ చేయించుకుని నేషనల్ క్రష్ గా పాపులారిటీ రష్మిక మందన్నా "ఛలో" అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ అయింది . నిజానికి ఛలో సినిమాలో ముందుగా హీరోయిన్ గా శ్రీలీలను అనుకున్నారట మేకర్స్. ఆమె కోసం బాగా ట్రై చేశారట. కానీ అది కుదరలేదు.
అయితే ఆమె కొన్ని కారణాల చేత ఈ సినిమా రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత ఈ సినిమా కోసం పలువురు హీరోయిన్స్ ని అనుకున్నా ఫైనల్లీ రష్మిక మందన్నా సెలెక్ట్ అయింది. ఈ సినిమా కోసం రష్మిక చాలా తక్కువ రెమ్యూనరేషన్ నే తీసుకుందట. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీ నే తన చుట్టూ తిరిగేలా మార్చుకునేసింది రష్మిక మందన్నా. ప్రజెంట్ బాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాజ్యం ఏలేస్తుంది ఈ బ్యూటీ . పలు పాన్ ఇండియా సినిమాలు చేతిలో పట్టుకొని ఫుల్ బిజీ బిజీగా ముందుకు వెళుతుంది..!!