స్టోరీ బాగున్న తన ఇమేజ్ కి సరిపోదని రిజెక్ట్ చేసిన చిరు.. ఆ హీరోకు బ్లాక్ బస్టర్..?

MADDIBOINA AJAY KUMAR
సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది స్టార్ హీరో క్రేజ్ ఉన్న వారు కొన్ని సినిమా కథలు నచ్చిన కూడా అవి తామపై వర్కౌట్ కావు అని తమకున్న ఈమేజ్ కు కొన్ని కథలు చేస్తే వాటిని ప్రేక్షకులు ఆదరించరు అనే ఉద్దేశంతో రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలా తన క్రేజ్ వల్ల ఒక సినిమాను వదులుకున్నాడట. ఇక ఆ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మరి చిరంజీవి తన ఈమేజ్ వల్ల స్టోరీ నచ్చిన వదిలేసిన సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం కోడి రామకృష్ణ దర్శకత్వంలో మన్యంలో మొనగాడు అనే సినిమా వచ్చింది.

ఈ మూవీ లో అర్జున్ హీరో గా నటించాడు. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. మొదటగా కోడి రామకృష్ణ ఈ సినిమాను చిరంజీవి హీరోగా చేయాలి అనుకున్నాడట. అప్పటికే చిరంజీవి కి స్టార్ హీరో క్రేజ్ రావడంతో ఆ కథ తనపై వర్కౌట్ కాదు అనే ఉద్దేశంతో ఆ సినిమాను రిజెక్ట్ చేశాడట. దానితో కోడి రామకృష్ణ ఇదే కథను అర్జున్ పై చిత్రీకరించగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నట్లు తెలుస్తోంది.

ఇలా చిరంజీవి తన ఈమేజ్ కారణంగా మన్యంలో మొనగాడు అనే సినిమాను వదిలేయగా ఆ సినిమా చేసిన అర్జున్ కి ఆ మూవీ ద్వారా అదిరిపోయే విజయం ధక్కినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం చిరంజీవి మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను వచ్చే సంవత్సరం 9 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: