ఏంటి అల్లు అర్జున్ కి ఆ హీరోయిన్ తండ్రి వార్నింగ్ ఇచ్చారా..ఎందుకు ఇచ్చారు.. అసలు అల్లు అర్జున్ చేసిన తప్పేంటి..స్టార్ హీరో అయినా అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇచ్చారంటే ఏదో తప్పు చేసే ఉంటారు అని ఈ విషయం తెలిసిన చాలా మంది ఏవేవో ఊహించుకుంటారు.మరి ఇంతకీ అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇచ్చిన ఆ హీరోయిన్ తండ్రి ఎవరో ఇప్పుడు చూద్దాం. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమా షూటింగ్లో ఉన్నారు. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెంచుతూ ఆగస్టు కి రావాల్సిన సినిమాని మళ్లీ డిసెంబర్ వరకు లాక్కెళ్ళారు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్ గ్లింప్స్, పాటలు అన్నీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి. ఇక భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఐటెం సాంగ్ లో ఎవరు చేస్తున్నారు అని చాలామందిలో ఒక ఆసక్తి అయితే ఉంది. ఎందుకంటే పుష్ప పార్ట్ వన్ లో స్టార్ హీరోయిన్గా అప్పటివరకు ఏ సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేయని సమంతని తీసుకువచ్చి సినిమాకి భారీ హెప్ ఇచ్చారు.
ఇక సెకండ్ పార్ట్ లో కూడా అలాంటి పెద్ద హీరోయిన్ తోనే సినిమాలో ఐటెం సాంగ్ లో చేయించాలి అనుకున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం సమంత, త్రిప్తి డిమ్రి వంటి వారితోపాటు ఇంకొంతమంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఏది నిజం కాలేదు. అయితే గత కొద్ది రోజులుగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే జాన్వి కపూర్ ని ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం తీసుకోవాలి అనుకున్నారట.అంతేకాదు నిర్మాత బోనికపూర్ ఇంటికి వెళ్లి మరి జాన్వీ కపూర్ ని పుష్ప-2 లో ఐటమ్ సాంగ్ చేయడం కోసం అడిగి రెమ్యూనరేషన్ ఇస్తామని వెళ్లారట. అయితే ఈ మాటలు విన్న జాన్వీ కపూర్ తండ్రి బోనికపూర్ సుకుమార్,అల్లు అర్జున్ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారట.
నా కూతురు ఇప్పుడిప్పుడే సౌత్ లో రాణిస్తోంది.మొదటి సినిమా చేశాక రెండో మూవీకే ఆమెను ఐటెం గర్ల్ గా మార్చేస్తే ఇక ఆమెకు సినిమాలో హీరోయిన్ అవకాశాలు ఏం వస్తాయి.అన్ని ఐటమ్ సాంగ్ ఆఫరర్లే వస్తాయి. ఇంకోసారి జాన్వీ కపూర్ దగ్గరికి వస్తే బాగుండదు. మీ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా తీసుకుంటారంటే చెప్పండి ఓకే చెబుతాం. కానీ ఇలాంటి ఐటెం సాంగ్ ఆఫర్స్ ఇంకోసారి తీసుకురాకండి అంటూ బన్నీ సుకుమార్లకి బోనీ కపూర్ వార్నింగ్ ఇచ్చినట్టు బీటౌన్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి