రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విషయంలో సైలెంట్ గా ఉండడానికి కారణం అదేనా.. మెగా హీరో ఇలాంటివి కూడా నమ్ముతాడా..?

Thota Jaya Madhuri
రామ్ చరణ్ అంటే ఇండస్ట్రీలో ఒక మార్క్ ఉంది. మెగాస్టార్ కొడుకు గానే కాదు ..తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు . ఇప్పుడు రామ్ చరణ్ సినిమా అంటే కేవలం తెలుగు జనాలు మాత్రమే కాదు పాన్ ఇండియా స్థాయిలో జనాలు ఆయన మూవీ గురించి  ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు . అంతేనా హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా చరణ్ తో సినిమా తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ గతంలో ప్రకటించారు .


కాస్తో కోస్తా వాళ్లు కూడా చరణ్ సినిమాలపై ఫోకస్ చేస్తూనే ఉంటారు. అటువంటి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నాడు . ఈ సినిమా ఎప్పుడు అనౌన్స్ చేశారో అందరికీ తెలిసిందే.  సంవత్సరాలు గడిచిపోతుంది ఈ సినిమా పై శంకర్ మాత్రం అస్సలు కాన్సెంట్రేషన్ చేయడం లేదు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఇవ్వడమే తక్కువ ఇచ్చిన అప్డేట్స్ కూడా అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి.


అంతేకాదు ఇప్పుడు మెగా అభిమానులకి బిగ్ డౌట్ వచ్చింది. ఎందుకు రాంచరణ్ ఇంత సైలెంట్ గా ఉన్నాడు.  ఈ విషయంలో కొంచమైన  సీరియస్ గా బిహేవ్ చేయకుండా ఎందుకు ఉన్నాడు..? అంటూ ప్రశ్నిస్తున్నారు . అయితే గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో రామ్ చరణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారట . ప్రమోషన్స్ చేయకపోయినా పర్వాలేదు సినిమా కంటెంట్ చూసి కచ్చితంగా హిట్ చేస్తారు అభిమానులు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారట . అంతేకాదు రామ్ చరణ్ ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా కూడా వెయిట్ చేస్తున్నారట.  అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే తన సినిమాకు ప్రమోషన్స్ చేసుకోకపోతే కచ్చితంగా లాస్ట్ మూమెంట్లో బోల్తా కొడుతుంది . మరి చరణ్ కి ఆ విషయం తెలియదా..? అంత కాన్ఫిడెంట్గా ఎందుకు ఉన్నాడు..? అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: