తెలుగు సినీ పరిశ్రమలో చాలా కాలం పాటు స్టార్
కమెడియన్ గా కెరియర్ను కొనసాగించిన వారిలో బ్రహ్మానందం ఒకరు. ఈయన ఎన్నో సినిమాలలో
కామెడీ పాత్రలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్నాడు. ఇకపోతే కేవలం బ్రహ్మానందం
కామెడీ సినిమాలలో మాత్రమే కాకుండా కొన్ని సినిమాల్లో సీరియస్ పాత్రల్లో కూడా నటించి ప్రేక్షకులకు ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ వస్తున్నాడు.
ఇకపోతే ఆయన మీద అభిమానంతో ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి లో రాజు అనే ఓ యువకుడు బ్రహ్మానందం పేరుతో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ఓపెన్ చేశాడు. ఇక రాజు అనే యువకుడికి
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలు అయినటువంటి
చిరంజీవి ,
బాలకృష్ణ ,
నాగార్జున ,
వెంకటేష్ ,
ప్రభాస్ , పవన్
కళ్యాణ్ ,
జూనియర్ ఎన్టీఆర్ ,
రామ్ చరణ్ ,
అల్లు అర్జున్ , మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు అంటే పెద్దగా ఇష్టం లేదంట. బ్రహ్మానందం అంటేనే ఆయనకు అభిమానం అంట. ఆ అభిమానంతో ఈయన ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి గ్రామంలో బ్రహ్మానందం పేరిట ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను ఓపెన్ చేశాడు.
ఇక ఆ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను బ్రహ్మానందం ఫోటోలతోనే నింపేశాడు. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి బ్రహ్మానందం ను బాగా అభిమానించే వ్యక్తులు కూడా వస్తుంటారట. ఇది ఇలా ఉంటే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో బ్రహ్మానందం కు బాగా నచ్చే వంటకాలు ఎంతో స్పెషల్ అంట. అలా రాజు అనే యువకుడు బ్రహ్మానందం పై ఉన్న అభిమానంతో ఆయన పేరుతో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను తెరిచి నడుపుతున్నట్లు తెలుస్తోంది.