సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వారు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. ఎందుకు అంటే వారి సినిమాలకు సంబంధించిన విషయాలను వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో వారు పంచుకుంటూ ఉంటారు. దానితో వారు సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా టచ్ లో ఉంటారు. అలాగే సినిమా నటీనటులకే సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ కూడా ఉంటారు. ఇకపోతే కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళితే సీనియర్ స్టార్ హీరోలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ద్వారా ప్రేక్షకులతో టచ్ లో ఉండేవారు కాదు.
ఈ తరం వారు మాత్రం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు అంటే చాలు సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఎలా ఆకట్టుకోవాలి ... వారితో ఏ విధంగా టచ్ లో ఉండాలి అనేది వారికి చాలా బాగా తెలిసి ఉంటుంది. దానితో సీనియర్ స్టార్ హీరోల కంటే కూడా జూనియర్లకే ఎక్కువ సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉంటున్నారు. ఇకపోతే సీనియర్లలో మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ను కలిగి ఉన్నాడు. చిరంజీవి కొంత కాలం క్రితమే ఇన్ స్టా గ్రామ్ లో , X అఫిషియల్ అకౌంట్ లను క్రియేట్ చేశాడు. ఇక చిరంజీవి ఇన్ స్టా , X అకౌంట్లను క్రియేట్ చేసుకొన్ని సైలెంట్ గా ఉండడం కాకుండా ఈ తరం హీరోల కంటే ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అనేక విషయాలను ఇతరులకు సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తూ వస్తున్నాడు.
దానితో ఇన్ స్టా లో చిరంజీవి కి ఏకంగా 3.3 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా ... X లో 2.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా చిరంజీవి ఇన్ స్టా , X ఫుల్ యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు పోస్టులు చేయడం ద్వారా ఈయనకు అద్భుతమైన రీతిలో ఈ రెండు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఫాలోవర్స్ ఉన్నారు.