సోషల్ మీడియాలో తారక్ కు భారీ స్థాయిలో ఫాలోయింగ్.. అక్కడ క్రేజ్ వేరే లెవెల్!

Reddy P Rajasekhar

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో తారక్ మరీ యాక్టివ్ గా ఉండరు కానీ ఈ హీరోకు ఉన్న క్రేజ్ మాత్రం తక్కువేం కాదు. ఫేస్ బుక్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఏకంగా 6.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. దేవర సినిమా రిలీజ్ సందర్భంగా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ సమయం యాక్టివ్ గా ఉన్న తారక్ గతంలో మాత్రం యాక్టివ్ గా ఉండేవారు కాదు.
 
అయితే జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా కొన్ని నిమిషాల్లోనే రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల నుంచి కూడా తారక్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం కొసమెరుపు. ఎక్స్ లో తారక్ కు ఫేస్ బుక్ కంటే ఎక్కువగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎక్స్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఏకంగా 7.7 మిలియన్ల మంది అభిమానులు ఫాలో అవుతున్నారు.
 
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటే తారక్ మాత్రం కేవలం ఎస్.ఎస్.రాజమౌళిని మాత్రమే ఎక్స్  లో ఫాలో అవుతుండటం గమనార్హం. తారక్ కు సోషల్ మీడియాలో వేరే లెవెల్ లో క్రేజ్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కు సోషల్ మీడియా వేదికగా క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. తారక్ కెరీర్ ను సైతం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.
 
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన టాలెంట్ తో అంతకంతకూ ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 7.9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తారక్ కు రాబోయే రోజుల్లో ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన తారక్ మరిన్ని సంచలనాలు సృష్టించాలని మరిన్ని రికార్డులను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: