సోషల్ మీడియాలో తరచూ వర్కవుట్స్, జిమ్, డ్యాన్స్ వీడియోస్ ప్రగతి పోస్ట్ చేస్తూ ఉంటారు. మధ్యలో ఫ్యామిలీ బాండింగ్ కనిపించే పోస్టులూ చేస్తారు. ఆమెకు కుమార్తె గీత అంటే ప్రాణం. తన గురించి తరచుగా మాట్లాడుతూ ఉంటారు. తెలుగు నటీమణి ప్రగతిని ప్రేక్షకులకు స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో ఆమె ప్రేక్షకులను రంజింపజేస్తుంది. అనిల్ రావిపూడి నిర్మించిన ఎఫ్ -3లో తల్లి పాత్ర లో ప్రేక్షకులను అలరించింది.ఈ సినిమాలో కూతుర్లకు పెళ్లి చేయడం కోసం ఆస్తి ఎంత ఉంటే అంత అనే డైలాగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఆఫ్ స్క్రీన్ లైఫ్‌ను చాలా క్వాలిటీగా గడిపేస్తుంది. తనకు నచ్చిన పని చేస్తుంది. సొసైటీని పెద్దగా పట్టించుకోదు. ఆడాలంటే ఆడేస్తుంది. పాడాలంటే పాడేస్తుంది. కసరత్తులు చేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రెండ్ అవుతుంది. ఈమె రెమ్యూనరేషన్ కూడా ఎక్కువే. ఒక్క రోజు కాల్షీట్ కోసం ప్రగతి దాదాపుగా 70 వేల వరకు డిమాండ్ చేస్తారట.అయితే పాత్ర నచ్చి.. ప్రొడక్షన్ హౌస్ చిన్నది అయితే.. డబ్బులు తక్కువ ఇచ్చినా అడ్జెస్ట్ అవుతారట. ఇక ఆర్టిస్ట్‌లు అందరితోనూ ఆమె ఇట్టే కలిసిపోతారు. అయితే పర్సనల్ లైఫ్‌లో చాలా ఒడిదొడుగులు ఎదుర్కొంది ప్రగతి.
తక్కువ వయసులో ఆమె పెళ్లి చేసుకుని.. ఇద్దరు పిల్లల తల్లి అయ్యారు. ఆ తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకోవడంతో.. పిల్లల బాధ్యత ఆమెపై పడింది. అలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వారిని పెంచి పెద్ద చేసింది.సినిమాలో తన కుమార్తె పాత్రలు వేసే హీరోయిన్స్‌తో చక్కటి అనుబంధం ఏర్పరుచుకుంటుంది ప్రగతి. ఇక నిజ జీవితంలో కూడా కుమార్తె అంటే ఆమెకు ప్రాణం. తనను కుమార్తెగా పొందడం అదృష్టం అని ప్రగతి చెబుతుంటారు. ప్రజంట్ ప్రగతి కుమార్తె గీతకు 18 సంవత్సరాలు. తను కూడా తల్లిలాగే ఎంతో అందంగా ఉంది.గతేడాదే ప్లస్ టూ పూర్తి చేసింది. ఇక గీత కూడా ఎంతో క్యూట్ గా ఉంటోంది. అందంలో అచ్చం అమ్మనే తలపిస్తోంది.అయితే ప్రస్తుతం చదువుపైనే దృష్టి సారించిన గీత ఇండస్ట్రీలోకి వస్తుందో లేదో ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు మాత్రం ప్రగతి కూతురు ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు ‘సినిమాల్లోకి ఎప్పుడు వస్తున్నారు మేడమ్’ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ఇండస్ట్రీవైపు ఇంట్రస్ట్ ఉందో, లేదో తెలియాల్సి ఉంది. ప్రజంట్ ప్రగతి కుమార్తె ఫోటో ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతుంది.