ఫ్యాన్ ఫాలోయింగ్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్న పవన్. ఆ రికార్డ్ పవన్ కే సాధ్యం!

Reddy P Rajasekhar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. పవన్ కళ్యాణ్ ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయిలో ఫాలోవర్లు వచ్చారు. ఇన్ స్టాగ్రామ్ లో కేవలం 16 పోస్టులతో పవన్ కళ్యాణ్ ఏకంగా 3.7 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకోవడం జరిగింది. పవన్ కు 37 లక్షల మంది ఫాలో అవుతున్నా పవన్ కళ్యాణ్ మాత్రం సోషల్ మీడియాలో ఎవరినీ ఫాలో కావడం లేదు.
 
ఎక్స్ లో కూడా పవన్ ఫ్యాన్ ఫాలోవర్ల విషయంలో అదరగొట్టారు. ఎక్స్ లో ఏకంగా 5.9 మిలియన్ల మంది పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. ఎక్స్ లో ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతికొద్ది మంది హీరోలలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు కావడం గమనార్హం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో సైతం తన ఫ్యాన్ ఫాలోయిం తో సంచలనాలు సృష్టిస్తున్నారనే చెప్పాలి.
 
జనసేన అధినేత పవన్ కు ఫేస్ బుక్ లో అయితే ఏకంగా 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫేస్ బుక్ లో ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం సులువైన విషయం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి ఉంటే మాత్రం ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగేదని కచ్చితంగా చెప్పవచ్చు. పవన్ కు సినిమాల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో పాలిటిక్స్ లో సైతం అదే స్థాయిలో క్రేజ్ అయితే ఉందని చెప్పవచ్చు.
 
పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో 2025లో అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తారేమో చూడాల్సి ఉంది. పవన్ సినిమాలపై దృష్టి పెడితే ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలను వేగంగా పూర్తి చేయడం మరీ కష్టమేం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఎంచుకుంటున్న కాన్సెప్ట్ లు సైతం కొత్తగా ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరుగుతోంది.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: