ఆ రికార్డ్ అల్లు అర్జున్‏కే సొంతం.. సౌత్ ఇండియాలనే ఫస్ట్ హీరోగా రికార్డ్..?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు కష్టపడి పైకి వస్తే మరి కొంత మంది.. మరొకరి సపోర్ట్ తో వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారిలో అల్లు అర్జున్ ఒకరు. హీరో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు పాన్ ఇండియా   హీరోగా ఎదిగారు అల్లు అర్జున్. అతి తక్కువ కాలంలోనే... సూపర్ హీరోగా మారిపోయారు. ఐ కాన్ స్టార్ అయిపోయారు.

అయితే దానికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో కూడా.... అల్లు అర్జున్ కు విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. మన తెలుగు ఇండస్ట్రీలో అల్లు అర్జున్ కు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్... ఏ హీరోకు లేదు. చిన్నపిల్లల నుంచి ముసలి ముతక వరకు అందరూ అల్లు అర్జున్ కోసం ఎగబడతారు. అల్లు అర్జున్ ఏ సినిమా రిలీజ్ అయిన... ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సినిమాలు అంటే నార్త్ ప్రేక్షకులు చాలా ఇష్టపడుతున్నారు.
 

పుష్ప సినిమాతో బన్నీ కెరీర్ పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. అంతేకాదు.. ఇంస్టాగ్రామ్ లో అల్లు అర్జున్ కు ఏ హీరోకు లేని ఫాలోయింగ్ ఉంది.  ప్రస్తుతం 27 మిలియన్ల ఫాలోవర్స్ దూసుకుపోతున్నాడు. అలాగే అల్లు అర్జున్ ఎక్స్ అకౌంట్ లో... ఆయన ఫాలోవర్స్ 8.4 మిలియన్ గా ఉంది. అదే సమయంలో ఫేస్బుక్లో... అల్లు అర్జున్ కు 21 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
 

ఇలా ఏ సోషల్ మీడియా చూసుకున్న...అల్లు అర్జున్ ను మించిన వారు ఎవరూ లేరు. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ హీరోగా ఇలా సోషల్ మీడియా ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు. అంతేకాదు ఉత్తర ప్రదేశ్ నుంచి తాజాగా ఓ అభిమాని...ఏకంగా అల్లు అర్జున్ కోసం సైకిల్ పైన వచ్చేసాడు. దాదాపు 1600 కిలోమీటర్లు సైకిల్ తొక్కి... అల్లు అర్జున్ ను కలిశాడు. అంతలా అల్లు అర్జున్ కు దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది.అలాగే... అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా ఏ హీరో వ్యవహరించిన అతనిపై దారుణంగా ట్రోలింగ్ చేస్తారు  బన్నీ ఫ్యాన్స్.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: