పెళ్ళికి ముందే అలాంటి పని చేయబోతున్న నాగచైతన్య - శోభిత..అక్కినేని సాంప్రదాయం అంటే ఇదేనేమో..!?
కాగా సోషల్ మీడియాలో తాజాగా ఒక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పెళ్లికి ముందే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల ఒక సినిమాలో కలిసి నటించబోతున్నారట . దానికి సంబంధించిన పనులు కూడా చకచకా కంప్లీట్ చేసేసుకుంటున్నారు ఈ జంట అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది . నాగచైతన్య నటించబోతున్న ఒక సినిమాలో ఆయనకు కాబోయే భార్య శోభిత కూడా సెకండ్ హీరోయిన్ గా ఒక్క చిన్న రోల్ లో కనిపించబోతుందట .
హైలైట్ ఏంటంటే ఈ సినిమాలో వీళ్ళిద్దరూ లవర్స్ గా మెప్పించబోతున్నారట . అయితే ఆల్రెడీ సమంతతో కూడా నాగచైతన్య ఇదేవిధంగా ముందుకు వెళ్లాడు . పెళ్లికి ముందే ఏ మాయ చేసావే, మనం ,ఆటోనగర్ సూర్య లాంటి సినిమాలలో ఇద్దరు కలిసి నటించి వావ్ అనిపించుకున్నారు. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని మళ్లీ శోభిత విషయంలోనూ అప్లై చేస్తున్నారు అంటూ జనాలు ఓ రేంజ్ లో ఆయనను ట్రోల్ చేస్తున్నారు . ఇదే ఏమో అక్కినేని సాంప్రదాయం అంటే అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. అక్కినేని నాగార్జున సైతం అమలతో పెళ్లికి ముందే నటించి మెప్పించాడు. ఆ తర్వాత నాగచైతన్య - సమంత ఇప్పుడు శోభిత ధూళిపాళ్ల .. ఇలా ఇది ఒక సాంప్రదాయం లాగా అక్కినేని ఫ్యామిలీ ఫాలో అయిపోతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!!