శోభిత అంటే నాగచైతన్య కి అంత ఇష్టమా..? సమంత కోసం చేయని పని కూడా చేసేస్తున్నాడే..!

Thota Jaya Madhuri
ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు నాగచైతన్య - శోభిత ధూళ్లిపాళ్ల. నిన్న మొన్నటి  వరకు మా మధ్య ఏమీ లేదు.. ప్రేమ అసలుకే లేదు అంటూ కొట్టి పడేసిన ఇద్దరు గుట్టూ చప్పుడు కాకుండా అక్కినేని నాగార్జున ఇంట్లో నిశ్చితార్థం చేసుకొని.. మేం పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ నిశ్చితార్థపు వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు . దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియా మొత్తం అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల గురించి మాట్లాడుకోవడం ప్రారంభించారు. 


అయితే రీసెంట్గా నాగచైతన్య తనకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్లతో ఉన్న ఒక పిక్చర్ ని షేర్ చేశాను. ఇందులో శోభిత ధూళిపాళ్ల టూ హాట్ గా ట్రెండీగా ఉండడమే కాకుండా నాగచైతన్య కూడా చాలా స్టైలిష్ లుక్ లో మెరిసారు. నిజానికి సమంత - నాగచైతన్య కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ సంబంధించిన ఫోటోలను నాగచైతన్య షేర్ చేసింది చాలా చాలా తక్కువ . పెళ్లయిపోయిన కూడా సమంత ఉన్న ఫోటోలు నాగచైతన్య ఎక్కువగా షేర్ చేయలేదు .


కానీ సమంత విషయంలో చేయని పనిని మాత్రం శోభిత విషయంలో చాలా ఫాస్ట్ గా చేసేస్తున్నాడు . నాగచైతన్య పెళ్లికి ముందే ఆమెతో షికార్లు చేయడమే కాకుండా ఆమెతో కలిసిన దిగిన పిక్స్ ను ఓపెన్ గానే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు. రీసెంట్గా షేర్ చేసిన పిక్ బాగా ట్రెండ్ అవుతుంది. దీంతో కొంతమంది ఈ జంట గురించి పాజిటివ్ గా మాట్లాడుతుంటే మరి కొంతమంది మాత్రం నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు . పెళ్లికి ముందే పని మొదలు పెట్టేసారా..? అంటూ ఘాటుగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ట్రోల్స్ చేస్తుంటే.. మరి కొంతమంది మాత్రం సమంత విషయంలో ఇంత జెన్యూన్ గా ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా అంటూ మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి నాగచైతన్య - శోభిత  కారణంగా సోషల్ మీడియాలో ఇంకా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు అన్నది మాత్రం వాస్తవం.  త్వరలోనే ఈ జంట మూడుముళ్లతో ఒకటి కాబోతుంది..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: