ప్రభాస్ కు సర్ప్రైజ్.. అక్కడ ముందుగానే బర్త్ డే సెలబ్రేషన్స్..!

Divya
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తన సినిమాలతో పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ విదేశాలలో కూడా ఈయనకు విపరీతమైన క్రేజ్ లభించింది అనడంలో సందేహం ఉండదు.. కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు కావడంతో అభిమానులు ఇప్పటి నుంచే సెలబ్రేషన్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ వేడుకలు మన తెలుగు రాష్ట్రాలలో చేయడం ఒక ఎత్తు అయితే జపాన్ వంటి ఇతర దేశాలలో ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఇప్పటి నుంచే మొదలుపెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ముఖ్యంగా అక్కడి ప్రభాస్ అభిమానులు రాధేశ్యామ్ సినిమాను రీ రిలీజ్ చేసి ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ ని అడ్వాన్స్ గా జరుపుకున్నారు. హ్యాపీ బర్త్డే ప్రభాస్ అని పెద్దపెద్ద బ్యానర్స్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభాస్ ఫోటోలతో హడావిడి చేశారు.  దీంతో జపాన్ లో ప్రభాస్ అభిమానులు చేసిన సందడి వీడియోలు , ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఇండియాలో కూడా ప్రభాస్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ అక్కడక్కడ మొదలైన విషయం తెలిసిందే.  ఇక అక్టోబర్ 23వ తేదీన చాలా గ్రాండ్గా దేశవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరగనున్నట్లు సమాచారం.
ప్రభాస్ విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు దక్కించుకున్న ప్రభాస్..  ఆ తర్వాత అన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ మరింత క్రేజ్ దక్కించుకున్నారు. గత ఏడాది సలార్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్..ఏడాది నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898AD చిత్రంతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. వచ్చే ఏడాది రాజా సాబ్ , ఫౌజీ వంటి చిత్రాలను విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: