అంతా అనుకున్నట్లు జరిగితే గేమ్ చేంజర్ కి తిరుగేలేదు.. ఆరు రోజుల్లో ఎన్ని వందల కోట్లో..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా ... ఎస్ జే సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కియార అద్వాని , చరణ్ కి జోడిగా నటించగా ... అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

ఇకపోతే ఈ సినిమాను కొంత కాలం క్రితం ఈ సంవత్సరం డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత ఈ సినిమాను డిసెంబర్ 20 వ తేదీన కాకుండా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్మెంట్ విడుదల చేశారు. ఇకపోతే అన్ని అనుకున్నట్లుగా జరిగి ఈ సినిమా చెప్పినట్లుగా జనవరి 10 వ తేదీన విడుదల అయ్యి మంచి టాక్ లు కనుక తెచ్చుకున్నట్లయితే ఈ సినిమాకు తిరుగేలేదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఎందుకు అంటే ... ఈ సినిమా జనవరి 10 వ తేదీన విడుదల అవుతుంది. ఆ రోజు రిలీజ్ డే కాబట్టి ఎలాగో ఓపెనింగ్ అదిరిపోయే రేంజ్ లో వస్తాయి. ఆ తర్వాత జనవరి 11 వ తేదీ శనివారం అవుతుంది. అలాగే 12 ఆదివారం అవుతుంది. 13 భోగి , 14 సంక్రాంతి  , 15 కనుమ వస్తుంది. ఇలా ఈ సినిమాకు విడుదల తేదీ తర్వాత ఐదు రోజులు హాలి డేస్ రానున్నాయి. దీనితో ఈ సినిమాకు మంచి టాక్ వస్తే వందల కోట్ల కనెక్షన్లు ఈ ఆరు రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: