ఆ రికార్డు విషయంలో టాప్ 10 లోకి రావడం కోసం కష్టాలు పడుతున్న దేవర.. ఛాన్స్ ఉందా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజుల క్రితం దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీ నుండి విడుదల అయిన సినిమాలలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో టాప్ 10 లోకి మాత్రం రాలేకపోయింది. కానీ ఆ లిస్టు లోకి రావడానికి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో ప్రయత్నాలు చేస్తుంది.

బాహుబలి 2 సినిమా 1810 కోట్ల కలెక్షన్లతో సౌత్ నుండి అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో ఉండగా , ఆ తర్వాత ఆర్ ఆర్ ఆర్ మూవీ 1290 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలోనూ , కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ 1233 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలోనూ , ఆ తర్వాత కల్కి 2898 AD సినిమా 1061.50 కోట్ల కలెక్షన్లతో నాలుగవ స్థానంలోనూ , రోబో 2.0 సినిమా 709 కోట్ల కలెక్షన్లతో 5 వ స్థానంలోనూ , సలార్ 630.15 కోట్ల కలెక్షన్లతో ఆరవ స్థానంలోనూ , జైలర్ మూవీ 606.30 కోట్ల కలెక్షన్లతో ఏడవ స్థానంలోనూ , బాహుబలి పార్ట్ 1 మూవీ 605 కోట్ల కలెక్షన్లతో ఎనిమిదవ స్థానంలోనూ , లియో మూవీ 600.60 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానంలోనూ , పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ 487.50 కోట్ల కలెక్షన్లతో 9 వ స్థానం లోనూ , ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ 453 కోట్ల కలెక్షన్లతో పదవ స్థానంలోనూ , దేవర పార్ట్ 1 మూవీ 22 రోజుల్లో 436 కోట్ల కలెక్షన్లతో 11 స్థానంలో ఉంది. మరి రాబోయే రోజుల్లో దేవర సినిమా ఈ లిస్టులో మరింత ముందుకు వెళుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: