ఎన్నో రికార్డులను కొట్టిన దేవర.. విజయ్ సినిమాను బీట్ చేస్తుందా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి కాస్త మిక్స్ డ్ విడుదల అయిన రోజే వచ్చింది. దానితో ఈ మూవీ పెద్ద స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయడం కష్టం అని చాలా మంది భావించారు. కానీ ఈ మూవీ మాత్రం అలా భావించిన వారి అంచనాలను తారుమారు చేస్తూ ఏకంగా ఇప్పటికే అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసింది.

ఈ మూవీ భారీ కలెక్షన్లను వసులు చేసిన కొన్ని రోజుల క్రితం తమిళ నటుడు విజయ్ హీరోగా రూపొందిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ కలెక్షన్లను మాత్రం ఇప్పటివరకు దాటలేక పోయింది. ఈ మూవీ కి గొప్ప టాక్ ఏమీ రాలేదు. కానీ ఈ మూవీ కి ఏకంగా 453 కోట్ల కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా వచ్చాయి. ఇక దేవర పార్ట్ 1 మూవీ ఇప్పటి వరకు 22 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 436 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దానితో ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను దాటేస్తుంది అని ఎన్టీఆర్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం మూవీ ఫైనల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను దాటేస్తుందో లేదో చూడాలి. దేవర మూవీ లో బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... ఈ సినిమాలో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: