మెగా డాటర్ నిహారిక పెళ్లి ఫిక్స్.. పెళ్ళికొడుకు ఎవరంటే..?

Amruth kumar
. . . ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే .. మెగాస్టార్ చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు, రామ్ చరణ్ ఇలా టాలీవుడ్లో అగ్ర హీరోలుగా దూసుకుపోతున్నారు . అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు . అయితే మెగా ఫ్యామిలీ లో ఆడపిల్లలు మాత్రం చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా సక్సెస్ అవ్వలేదు . చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత హీరోయిన్గా రావాలనుకున్న అనుకోని కారణాలతో ఆమె నిర్మాతగా సెటిలైంది .

అలాగే మెగా బ్రదర్ నాగబాబు చిన్న కూతురు నిహారిక కూడా యాంకర్ గా కెరీర్ను మొదలుపెట్టి హీరోయిన్గా పలు సినిమాల్లో నటించిన సక్సెస్ అవలేదు. ప్రస్తుతం నిర్మాతగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది . అంతేకాకుండా మెగా ఫ్యామిలీలో ఆడపిల్లలు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకొవ‌టం కామన్ గా మారిపోయింది. ముందుగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ‌ ముందు భరద్వాజ్ ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి .. ఆ తర్వాత అతనకు విడాకులు ఇచ్చేసింది. తర్వాత చిరంజీవి శ్రీజ‌ను కళ్యాణ్ దేవ్ కి ఇచ్చి రెండో పెళ్లి చేయక అతన్ని కూడా దూరం పెట్టింది ..

అలాగే మెగా డాటర్ నిహారిక కూడా ముందుగా జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత బాగానే ఉన్నా ఈ జంట 2023 లో విడాకులు తీసుకుని విడిపోయారు . ప్రస్తుతం నిహారిక ఒంటరిగా ఉంటుంది . అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నిహారికకు మరో పెళ్లి చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే పెళ్లి కొడుకుని కూడా మెగా ఫ్యామిలీ కన్ఫామ్ చేసినట్టు తెలుస్తుంది . త్వరలోనే ఈ పెళ్లి గురించి అధికార ప్రకటన నాగబాబు చేస్తారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: