శ్రీనిధి శెట్టి.. చదువుల్లో తోపు.. యూనివర్సిటీలో టాప్..
చదువుని ఎప్పుడూ వదులుకోవద్దు అని కూడా శ్రీనిధి శెట్టి చెబుతూ వచ్చేది అందుకే ఆమె చదువును నిర్లక్ష్యం చేయలేదు. హీరోయిన్ అవ్వాలని చెప్పినప్పుడు అలాగే అవ్వు అని కూడా ప్రోత్సహించేదట. అయితే ఏం అనుకున్నట్టుగానే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ అయ్యింది. కానీ ఆమె విజయాన్ని చూడ్డానికి ఇప్పుడు తల్లి ఈ లోకంలో లేదు. 14 ఏళ్ల సమయంలోనే శ్రీనిధి అమ్మ ఆరోగ్యంతో చనిపోయింది. ఈ ముద్దుగుమ్మకు ఒక అక్క ఉంది తండ్రి కూడా ఆమెకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉండేవాడు.
అమ్మ చెప్పినట్లుగా వింటూ శ్రీనిధి బాగా చదువుకుంటూ ట్రిపుల్-ఈ ఎంట్రన్స్‌లో మెరుగైన ర్యాంకు సాధించిందింది. బెంగళూరు జైన్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందింది. బీటెక్ కంప్లీట్ చేయడమే కాకుండా యూనివర్సిటీ టాపర్‌గా నిలిచి వావ్ అనిపించింది. క్యాంపస్ ఇంటర్వ్యూలోనే చాలా పెద్ద ఉద్యోగం సంపాదించింది. యాక్సెంచర్ కంపెనీ ముంబై బ్రాంచీలో జాబ్లో జాయిన్ అయింది. అమ్మ కోరిక తీర్చాననే సంతృప్తి కలిగిన తర్వాత ఆమె నటి కావాలని ఆశపడింది. ఈ బ్యూటీ మంగళూరుకు సమీపంలో ఉన్న ఓ చిన్న పల్లెటూరులో పెరిగింది. వారిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి చిన్న ఉద్యోగం చేసేవాడు. తల్లి మాత్రం తన కూతుర్లను పెద్ద కంపెనీల్లో ఉద్యోగులుగా చూడాలనుంది. కానీ శ్రీనిధికి చిన్నతనం నుంచే సినిమాలంటే పిచ్చి. దగ్గర్లో థియేటర్లు కూడా లేకపోవడంతో వాళ్ల మావయ్య చేత అద్దెకి సీడీలు తెప్పించేవారు. శ్రీనిధి చూసిన తొలి సినిమా ‘మొఘల్ ఏ ఆజమ్’. ఇది అప్పట్లో ఒక పెద్ద హిట్టు అది చూసాకే ఆమె హీరోయిన్ కావాలని బలంగా నిర్ణయించుకుంది.
2015లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసిన తర్వాత మోడల్‌గా ప్రారంభించింది. కొన్ని ప్రకటనల్లో నటించింది. అయితే అప్పట్లో ఆమె చాలా సాఫ్ట్ గా మాట్లాడటం వల్ల అందరూ హేళన చేసేవారు. నీవుచ్చారణ బాగోలేదు అంటూ మొహం మీదే ఆమెను అవమానించేవారు. కానీ తన తల్లిని తలుచుకుంటూ ఏదైనా అనుకుంటే సాధించేదాకా వదలకూడదు అని మానసికంగా బాలగంగా తయారయింది. క్రమంగా పొగడ్తలకు, విమర్శలకు పొంగిపోకుండా, కృంగిపోకుండా మెంటల్ గా స్ట్రాంగ్ గా తయారయింది. అందాల పోటీల్లో కూడా పాటిస్పేట్ చేస్తూ 2015లో మిస్ కర్ణాటక, 2016లో మిస్ సుప్రనేషనల్, యమహా ఫసీనో మిస్ దివా టైటిళ్లను నెగ్గింది. దాంతో ఆమె ఫోటోలు వార్తాపత్రికల్లో ప్రచురించారు. అవి చూసే ప్రశాంత్ నీల్ ఆమెను ఆడిషన్‌కి పిలిచి ‘కేజీఎఫ్’లో హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. అలా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయింది.