అక్కినేని హీరో మరోసారి షాక్ ఇవ్వబోతున్నాడా.. ఇక నాగార్జున పరువు పాయె..!
కానీ స్టార్ హీరోలుగా ఇప్పటికీ గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో వీరి వ్యక్తిగత జీవితాలు కూడా ఎప్పుడూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతూనే వస్తున్నాయి. ఇక నాగచైతన్య - సమంతని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే మరో హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. సమంత తో విడాకులు తర్వాత నాగచైతన్య లైప్ గూరించి సోషల్ మీడియలో ఎంతో హాట్ టాపిక్ గా నిలిచింది. రీసెంట్ గా కొండా సురేఖ నాగ చైతన్య విడాకులపై చేసిన వ్యాఖ్యలు ఎంతో దుమారం లేపాయి.
ఇప్పుడు ఈ గొడవ మరవకముందే మరో తలనొప్పి అక్కినేని ఫ్యామిలీకి రాబోతుంది. అఖిల్ టాలీవుడ్ లో హీరోగా అడుగుపెట్టి ఒక్కటంటే ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయాడు . అలాగే తన వ్యక్తిగత జీవితంలో కూడా సక్సెస్ కాలేకపోయాడు.. నాగచైతన్య పెళ్లి సమయంలోనే అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని క్యాన్సిల్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు అక్కినేని అఖిల్ నాగార్జునకు గట్టి షాక్ ఇవ్వబోతున్నాడని వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయం ఏమిటంటే అక్కినేని అఖిల్ ఓ హీరోయిన్ ను లవ్ చేస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నారని కూడా అంటున్నారు. ఇదే విషయాన్ని నాగార్జునకు కూడా అఖిల్ చెప్పాడని కూడా అంటున్నార.. అయితే అఖిల్ పై నాగార్జున సీరియస్ అయ్యాడని కొన్నాళ్లు అఖిల్ ను సినిమాలకు దూరంగా ఉంచాలని డిసైడ్ అయ్యాడని కూడా అంటున్నారు. ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.