ఓరి దేవుడా.. 3 మూవీలో శృతిహాసన్ చెల్లి ఏముంది రా బాబు.. అందంతో సోషల్ మీడియాలోనే సెగలు పుట్టిస్తుంది గా..!

Amruth kumar
సౌత్ స్టార్ హీరో ధనుష్ విభిన్నమైన సినిమాలతో సాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస ప్రయోగాలు చేస్తూనే స్టార్ హీరోగా మారాడు. ఇక రీసెంట్ గానే రాయన్‌ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ డైనమిక్ హీరో. అలాగే ఈ సినిమాకు తానే డైరెక్ట్ చేయటం మరో విశేషం .. అయితే ఇప్పుడు ధనుష్ నటించిన త్రి మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 2013లో వచ్చిన ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య  రజనీకాంత్ డైరెక్షన్లో వచ్చింది. అలాగే ఈ సినిమాలో ధనుష్‌కు జంటగా శృతిహాసన్ హీరోయిన్గా మెప్పించింది.

అదేవిధంగా ఈ సినిమాలో టీనేజ్ ప్రేమ కథను కూడా బాగా పండించారు. ఈ సినిమాలో శృతిహాసన్ చెల్లిగా నటించిన ఆర్టిస్ట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆమె ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుంది.. అనే విషయాలు ఇక్కడ చూద్దాం. ఇంతకీ ఆమె పేరు  గాబ్రియెల్లా నటాలీ చార్ల్టన్.. సౌత్ లో వచ్చిన పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హీరోయిన్ ఫీచర్స్ తో సోషల్ మీడియాలో సేగ‌లు పుట్టిస్తుంది.

9ఏళ్ల‌ వయసులోనే యాక్టింగ్ కెరియర్ మొదలుపెట్టిన గాబ్రియెల్లా.. బాల నటిగా మెప్పించింది. అలాగే పలు డాన్స్ రియాల్టీ షోలిలో కూడా పాల్గొని సందడి చేసింది. ఈ క్రమంలోనే త్రీ సినిమాలో నటించే చాన్స్ అందుకుంది. ఆ మూవీలో శ్రుతి చెల్లిగా కనిపించింది. ఆ సినిమా వచ్చిన మూడేళ్లకు హీరోయిన్‌గా టర్న్ అయింది ఈ బ్యూటీ. అప్పా మూవీతో రషిత పాత్రలో మెరిసింది. ఆ తర్వాత ఈ చిన్నది సినిమాలకు బ్రేక్ ఇచ్చి స్టడీపై పెట్టింది. ఇక ఇప్పుడు తిరిగి స్మాల్ స్క్రీన్ పై మరోసారి సందడి చేస్తోంది. ఓ వైపు టీవీ షోలు చేస్తూనే మరో వైపు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో తన అందాలతో కుర్రకారు మది దోచుకుంటుంది. తన పిక్స్‌కు ఓ రేంజ్‌లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: