చిరు.. చరణ్ ఇద్దరికీ ఇన్ డైరెక్ట్ గా ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన కృష్ణ.. ఆ మూవీలేవో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే చిరంజీవి , రామ్ చరణ్ ఇద్దరూ కూడా తండ్రి , కొడుకులు అనే విషయం మనకు తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన సూపర్ స్టార్ కృష్ణ ఇన్ డైరెక్ట్ గా ఇటు చిరు అటు చరణ్ కి హిట్లను అందించాడు. ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి "ఖైదీ" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వాసులు చేసి అప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్లను రాబట్టి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే చిరంజీవి కి అదిరిపోయే రేంజ్ క్రేజ్ వచ్చింది. ఇకపోతే మొదట ఖైదీ సినిమాను కృష్ణ తో  చేయాలి అనుకున్నారట. కథ మొత్తం విని కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా చేయను అని కృష్ణ చెప్పడంతో అది మెగాస్టార్ వద్దకు వెళ్లిందట. ఇకపోతే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొంత కాలం క్రితం మగధీర అనే సినిమాలో హీరోగా నటించిన అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. 

ఈ మూవీ కి రాజమౌళి దర్శకత్వం వహించగా ... విజయంద్ర ప్రసాద్ కథను అందించాడు. ఇక చాలా సంవత్సరాల క్రితం విజయేంద్ర ప్రసాద్ ఈ కథను కృష్ణ గారి కోసం తయారు చేశారట. అది కృష్ణ కు వినిపించగా ఆయన కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత రాజమౌళికి ఈ కథ నచ్చడంతో దీనిని చరణ్ తో చేశాడట. ఇలా కృష్ణ ఇన్ డైరెక్ట్ గా చిరు , చరణ్ లకి ఇండస్ట్రీ హిట్ లను ఇచ్చాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: