ఇండస్ట్రీని షేక్ చేసేద్దామని ప్రభాస్ ఎంతో ఇష్టంగా చేసిన సినిమా ఇదే.. రిజల్ట్ మాత్రం తుస్సు..!

Thota Jaya Madhuri
ఏ హీరో అయిన సరే తాను నటించే సినిమాలు కచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాడు. ఇండస్ట్రీ చరిత్ర ని తిరగ రాయాలి అని ప్రతి హీరో కూడా ఆ సినిమా షూట్ చేసే టైం లో కష్టపడుతూ ఉంటారు . కానీ కొన్ని కొన్ని సార్లు అది ట్రాక్ తప్పతో ఉంటుంది.  అది ఏ కారణం చేతనైనా కావచ్చు . కంటెంట్ బాగో లేకపోయినా.. డైరెక్షన్ బాగో లేకపోయినా .. హీరో హీరోయిన్ల పర్ఫామెన్స్ అంతంత మాత్రమే ఉన్నా కూడా జనాలు ఆ సినిమాను లైక్ చేయరు.


అలాంటి సినిమాలు ఇండస్ట్రీలో బోలెడు ఉన్నాయి . అయితే ప్రభాస్ కెరియర్ లోను అలాంటి సినిమా ఉంది. మరీ ముఖ్యంగా రెబెల్ ఫాన్స్ తో పాటు ప్రభాస్ కూడా ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది.. ఇండస్ట్రీ చరిత్ర తిరగ రాస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన సినిమా.. కనీసం ప్రభాస్ అభిమానులకు కూడా నచ్చకుండా తుస్సు మనిపించింది.  ఆ మూవీ మరేంటో కాదు "మున్న". ఈ సినిమా పేరు చెప్పితే ప్రభాస్ అభిమానుల కళ్లల్లో నీళ్లు తిరుగుతాయ్.


2007లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్గా .. ప్రభాస్ హీరోగా నటించారు.  ఈ సినిమా రిలీజ్ టైం లో రెబల్ ఫాన్స్ చేసిన హంగామా అంతా ఇంత కాదు . మరీ ముఖ్యంగా "మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా".. అనే సాంగ్ ఎంత హైలెట్గా మార్చేసారో కూడా చూసాం.  అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి మాత్రం పూర్తిగా తారు మారు అపోయింది . అసలు ఈ సినిమాలో ప్రభాస్ ఎందుకు నటించాడు..? ఏం చూసినటించాడు..? అంటూ రెబల్ ఫాన్స్ కూడా బాధపడ్డారు.  అంతలా ఈ సినిమా డిజాస్టర్ టాక్ అందుకుంది.  ఇప్పటికి టీవీలో "మున్న" సినిమా వస్తే ప్రభాస్ ఫ్యాన్స్ వంశి పైడిపల్లి పై మంటపడిపోతూ ఉంటారు.  మా హీరో కి ఇలాంటి సినిమా ఇచ్చావ్ ఏంటి..? అంటూ ఫైర్ అవుతూ ఉంటారు.  అలాంటి ఒక చెత్త టాక్ అందుకుంది ఈ "మున్న" సినిమా..!!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: