తెలుగు హిరోకి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ సూర్య .. అంత కోపం ఎందుకు వచ్చింది..?
కెరియర్ స్టార్టింగ్ లో చాలా చాలా నాటి రొమాంటిక్ సినిమాలలో నటించిన సూర్య .. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం చాలా చాలా పద్ధతిగా ఉన్న పాత్రలను చూస్ చూసుకుంటున్నారు. ముఖ్యంగా జనాలకు ఉపయోగపడే సినిమాలు.. మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ ..లనే ఎక్కువ చూసుకుంటున్నాడు . కాగా అలాంటి సూర్య తెలుగు హీరోకి స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చిన న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సూర్య చాలా నెమ్మదస్తుడు . ఎక్కడ కూడా మాట తూలడు . ఎవరిని కోప్పడడు.
ఏ విషయానైనా సరే చాలా చక్కగా సరిదిద్దుతాడు. అలాంటి సూర్యకి కోపం తెప్పించాడు తెలుగు హీరో . ఆయన మరెవరో కాదు "రానా దగ్గుబాటి". రానా దగ్గుబాటి నటించిన సినిమా చూసి ఆయనను ఏకంగా కార్ లో తీసుకెళ్తూ రోడ్ల పైన క్లాస్ పీకాడట సూర్య. " అసలు నువ్వు నటిస్తుంది నటనేనా..? దీన్ని యాక్టింగ్ అంటారా ..? కాదు, ఇలా అయితే నీ కెరీర్ ఢమాల్ అంటూ పడిపోతుంది . ఇంకా మంచిగా నటించాలి . స్పెషల్ క్లాస్సెస్ తీసుకో.. ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ అయినా ఇవ్వగలగాలి ..జనాలు చేత శభాష్ అనిపించుకోగలగాలి . మనం ఒక పాత్రకు కమిట్ అయితే ఆ పాత్రలో లీనమైపోవాలి అంటూ చాలా చాలా ఓపెన్ గానే రానా పై కోప్పడ్డాడట . ఇదే విషయాన్ని స్వయంగా రానానే ఓ ఈవెంట్ లో బయట పెట్టడం గమనార్హం. అయితే అదే మూమెంట్లో సూర్య కూడా పక్కన ఉండడం విశేషం . చాలా నిజాయితీగా ఉండే సూర్య ఏ విషయం అయినా ఓపెన్ గా చెప్పేస్తాడు అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్..!