స్నేహ రెడ్డి చేసిన ఒకే ఒక్క పని .. వాళ్ళందరి నోర్లు ఖతక్ అంటూ మూయించిందిగా..!

Thota Jaya Madhuri
సోషల్ మీడియాలో బన్నీ భార్య స్నేహారెడ్డికి ఏ విధమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం మనం చూస్తూనే ఉన్నాం.  స్టైలిష్ స్టార్ గా బన్నీ ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడో.. అంతకు ఏమాత్రం తీసిపోని రేంజ్ లో బన్నీ భార్య స్నేహారెడ్డి కూడా అభిమానులను సంపాదించుకున్నింది.  మరి ముఖ్యంగా ఆమె వర్క్ అవుట్ వీడియోస్ కి ఆమె పోస్ట్ చేసే ఫొటోస్ కి జనాలు ఫిదా అవుతూ ఉంటారు .


అయితే చాలామంది జనాలు ఎప్పుడూ ఆమె మోడ్రెన్ బట్టల్లోనే ఆకట్టుకుంటుంది అని ఆమెకు మన సంప్రదాయాలు తెలియవని ..చాలా సందర్భాలలో ట్రోళ్ చేశారు . అలాంటి వాళ్ళ నోరు మూయించే పని చేసింది  బన్నీ భార్య స్నేహారెడ్డి. దీంతో ఆమె పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.  స్నేహ రెడ్డి తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది.  ఆ ఫొటోస్ చూసిన జనాలు ఆమెను ఓ మహాలక్ష్మి గా కామెంట్స్ చేస్తున్నారు.


చక్కగా .. అందంగా..  ట్రెడిషనల్ గా ఉన్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు , రెడ్ కలర్ శారీలో చాలా పద్ధతిగా మన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్న అమ్మాయిగా కనిపించింది స్నేహ రెడ్డి . తలలో పూలు చేతికి గాజులు.. ముఖాన కుంకుమ పెట్టుకొని నిండు ముత్తైదువుల దర్శనం ఇచ్చింది . స్నేహారెడ్డి ని ఎప్పుడు మోడ్రన్ దుస్తులోనే  చూస్తూ విసిగిపోయిన జనాలకు ఈ సరికొత్త లుక్స్ బాగా ఆకట్టుకునేలా చేసింది. నేడు అట్లతద్ది సందర్భంగా ఆమె ట్రెడిషనల్ గా రెడీ అయ్యి ఉదయాన్నే లేచి పద్ధతిగా పూజ చేసి అట్లతద్ది పండుగను జరుపుకుంది . దానికి సంబంధించిన ఫొటోస్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.  ఆ ఫొటోస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వదినమ్మ అంటూ ముద్దుగా పిలుస్తున్నారు..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: