మెకానిక్ రాకీ ట్రైలర్ రివ్యూ.. విశ్వక్ సేన్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరినట్టేనా?

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న హీరోలలో విశ్వక్ సేన్ ఒకరు కాగా విశ్వక్ సేన్ ఈ ఏడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో విజయాలను అందుకున్నారు. ఈ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి. నవంబర్ నెల 22వ తేదీన విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
 
విశ్వక్ సేన్ అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చే విధంగా ఈ ట్రైలర్ ఉండగా ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌ పై రామ్ తాళ్లూరి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. రవితేజ ముళ్లపూడి ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ యూత్ ను మెప్పించేలా ఉండగా సునీల్ విలనిజం ఈ సినిమాకు హైలెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
 
మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా ఈ ఇద్దరు హీరోయిన్లకు సినిమాలో మంచి పాత్రలే దక్కాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కంప్యూటర్ సైన్స్ చదివి సివిల్ ఇంజనీర్ అవుతానంటూ విశ్వక్ చెప్పిన డైలాగ్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాతో విశ్వక్ సేన్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న విశ్వక్ సేన్ తను నటించిన ప్రతి సినిమా సక్సెస్ సాధించేలా జాగ్రత్త వహిస్తూ అభిమానులను మెప్పిస్తున్నారు. విశ్వక్ సేన్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. విశ్వక్ సేన్ పారితోషికం 8 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది. విశ్వక్ సేన్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ట్రైలర్ లో మీనాక్షి చౌదరి అందంగా కనిపించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: