టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ వరుస సినిమాలతో చాలా బిజీ గా వున్నారు. ఒకే సారి మూడు సినిమాలకు కమిట్ అయిన స్టార్స్ చాలా మంది వున్నారు.. దీనితో దర్శకులకు స్టార్ హీరోల డేట్స్ దొరకడం చాలా కష్టంగా మారింది.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ త్రివిక్రమ్, కొరటాల శివ, సుకుమార్ లు తమ తరువాత సినిమా అనౌన్స్ చేసేందుకు చాలా టైం తీసుకునే పరిస్థితి ఏర్పడింది.. ఎందుకంటే ప్రస్తుతం స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా రేంజ్ మూవీస్ లో నటిస్తుందటంతో ఒక్కో సినిమా కనీసం 2 సంవత్సరాలు పడుతుంది.. దీనితో ఆ స్టార్ హీరో లైనప్ లో వుండే దర్శకులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మహేష్ తో తెరకెక్కించిన గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నాడు..
అయితే ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్ కి వస్తున్నా కూడా తన నెక్స్ట్ సినిమా మొదలు పెట్టలేదు.దీనికి కారణం అల్లు అర్జున్.. త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమాను అల్లు అర్జున్ తో చేయాలనీ చూస్తున్నాడు.. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 లో బిజీ గా ఉండటంతో త్రివిక్రమ్ అల్లు అర్జున్ కోసం ఎదురుచూడక తప్పడం లేదు.. ఇదిలా ఉంటే రీసెంట్ గా దేవర సినిమాతో అద్భుత విజయం అందుకున్న కొరటాల తరువాత దేవర పార్ట్ 2 చేస్తారని అంతా భావించారు.. కానీ ఎన్టీఆర్ వేరే సినిమాలతో బిజీ గా ఉండటంతో కొరటాల వేరే హీరోతో కొత్త సినిమా ప్లాన్ చేసే పని లో వున్నాడు.. అలాగే సుకుమార్ సైతం పుష్ప 2 తరువాత రాంచరణ్ కోసం ఎదురు చూడాల్సిందే.. బుచ్చి బాబుతో సినిమా పూర్తి కాగానే రాంచరణ్ సుకుమార్ మూవీ చేయనున్నారు. దీనితో ఈ కాంబోస్ లో సినిమా వచ్చే సరికి ఎన్నేళ్లు పట్టుద్దో చూడాలి మరీ..