బాహుబలి లాంటి ట్విస్ట్ తో "జయం మనదేరా".. డబుల్ రోల్ లో వెంకీ విధ్వంసం..!!

Pandrala Sravanthi
-వెంకటేష్ కెరీర్ లోనే భారీ హైప్ తో వచ్చిన సినిమా..
- ద్విపత్రాభినయంలో కుమ్మేసిన వెంకీ


 చాలామంది హీరోలు తమ సినీ కెరియర్లో ఒక్కసారైనా ద్విపాత్రాభినయంలో నటించి ఉంటారు.ఇక కొంతమంది హీరోలు అయితే పదుల కొద్ది సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.అయితే అలాంటి వారిలో వెంకటేష్ కూడా ఒకరు. ఈయన కూడా కొన్ని సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు.ఇక అలాంటి సినిమాల్లో జయం మనదేరా ఒకటి.. మరి వెంకీ నటించిన జయం మనదేరా సినిమా స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
 సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మాత డి సురేష్ బాబు ప్రొడ్యూసర్ గా ఎన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జయం మనదేరా.. వెంకటేష్, సౌందర్య భానుప్రియలు హీరో హీరోయిన్లుగా  బ్రహ్మానందం,అలీ, జయప్రకాశ్ రెడ్డి, ఝాన్సీ, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, ఏవీఎస్, ఆహుతి ప్రసాద్ వంటి ఎంతోమంది కీలక ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు.. ఇందులో వెంకటేష్ డబుల్ రోల్ పోషించగా తండ్రి పాత్రలో నటించిన వెంకటేష్ కి జోడిగా భానుప్రియ కొడుకు పాత్రలో నటించిన వెంకీకి జోడిగా సౌందర్య నటించింది. అక్టోబర్ 7 2000 సంవత్సరంలో విడుదలైన జయం మనదేరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఈ సినిమాలో ఉన్న పాటలు ఇప్పటికి కూడా ఎవరు గ్రీనే.. భారీ క్యాస్టింగ్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసింది. అంతేకాదు ఈ సినిమాలోని పాటలు, స్టోరీ,యాక్షన్ ప్రతి ఒక్కటి బాగుండడంతో ఈ సినిమా ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.అలా ఈ సినిమా ఒక ఫిలింఫేర్ అవార్డుతో పాటు రెండు నంది అవార్డులను కూడా అందుకుంది. వెంకటేష్ సినీ కెరియర్లో బాక్స్ ఆఫీస్ వద్ద అత్యంత హంగామా చేసిన సినిమా ఇదే అని చెప్పుకోవచ్చు.ఈ సినిమాలో అన్నా చెల్లెలు ఎమోషన్,తండ్రి కొడుకుల ఎమోషన్,తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకునే కొడుకు కి సంబంధించిన సన్నివేశాలు అన్నీ చాలా అద్భుతంగా పండాయి. అలాగే హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ కూడా చాలా బాగా సెట్ అయింది. ఇక హిట్ పెయిర్ అయినటువంటి సౌందర్య వెంకీల జోడి ఈ సినిమాకి హైలెట్ అని చెప్పవచ్చు.ఇక ఈ సినిమా అచ్చం బాహుబలి మూవీని పోలి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: