హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూతురు.. ఇంతకీ ఎవరంటే?

praveen
ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్టు, సహయ నటి సత్య కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో దాదాపు 60కి పైగా సినిమాల్లో చాలా మంచి పాత్రలు పోషించే అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఆనంద్, బొమ్మరిల్లు, సామాన్యుడు, రెడీ, దూకుడు, బాద్ షా, గోవిందుడు అందరివాడేలే, ఆడవాళ్లు మీకు జోహర్లు వంటి సూపర్ హిట్ సినిమాల్లో హీరో హీరోయిన్ల బంధువుల రోల్స్ చేసింది. ఉల్లాసంగా ఉత్సాహంగా, దుబాయ్ శీను సినిమాల్లో సత్య కృష్ణన్‌ చేసిన సన్నివేశాలు చాలా హిట్ అయ్యాయి. అందువల్ల ఆమె తెలుగు ప్రేక్షకులందరికీ బాగా దగ్గర అయింది రీసెంట్ గా ఓటీటీలో హిట్ వెబ్ సిరీస్ అయిన "సేవ్ ది టైగర్స్"లోనూ నటించి మెప్పించింది.
నటి సత్య కృష్ణన్ వాయిస్ లో ఒక బేస్ ఉంటుంది అదే ఆమె ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన సత్య కృష్ణన్.. ఇప్పుడు పెద్దగా అవకాశాలు అందుకోలేకపోతోంది. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్ గా ఉండదు. అయితే సత్య కృష్ణన్ నట వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఆమె కూతురు రెడీ అయింది. ఈ అమ్మాయి త్వరలోనే తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం కాబోతుంది.
సత్య కృష్ణన్ గారాల పట్టి పేరు అనన్య కృష్ణన్. ఈ ముద్దుగుమ్మ తెలుగులో గ్యాంగ్ స్టర్ గంగరాజు చిత్రంలో తొలిసారిగా నటించింది. ఆ సినిమా హిట్ కాలేదు కానీ అందులో ఆమె మంచి పాత్రే పోషించింది. ఊ అంటావా మావ ఊహు అంటావా మావ సినిమాలో చిన్న రోల్ చేసింది. ఇప్పుడు మెయిన్ హీరోయిన్‏గా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యింది. జబర్దస్థ్ రాకేష్ హీరోగా నటిస్తున్న "కేసీఆర్" చిత్రంలో అనన్య హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ విడుదలయ్యాయి. ఇవి చాలామందిని ఆకట్టుకున్నాయి. ఈసినిమా హిట్ అయితే అనన్యకు హీరోయిన్ గా మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. అనన్యకు సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది ఆమె ఫోటోలు బాగా వైరల్ అవుతుంటాయి.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: